https://oktelugu.com/

Russia-Ukraine War : క్షిపణులు ప్రయోగస్తా.. మిత్ర దేశాల అండతో ఉక్రెయిన్‌ దూకుడు..!

ఒకవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ హమాస్, హెజ్‌బొల్లా, ఇరాన్‌తో యుద్ధం చేస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం రెండేళ్లుగా సాగుతూనే ఉంది. తాజాగా నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపడంతో రష్యా అణు పరీక్షలకు సిద్ధమైంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 3, 2024 / 02:17 AM IST

    Russia-Ukraine War

    Follow us on

    Russia-Ukraine War :  రష్యా–ఉక్రెయిన్‌ మధ్య రెండేళ్లుగా సాగుతున్న యుద్ధం మరింత ముదురుతోంది. ఇరు దేశాలు ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. మిత్రదేశాల అండతో ఉక్రెయిన్‌ దూకుడు పెంచుతోంది. మరోవైపు రష్యాకు మద్దతుగా, ఉక్రెయిన్‌ 12 వేల మంది సైనికులను రష్యాకు పంపింది. ఈ సైనికులు ఉక్రెయిన్‌లో అడుగు పెట్టారు. మరోవైపు నాటో దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడం రష్యాకు కోపాన్ని తెప్పించింది. నాటో దళాలు రష్యాపై దాడులు చేస్తే అణు దాడికి వెనకాడమని రష్యా హెచ్చరించింది. ఈక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణు పరీక్షలు నిర్వహించాలని న్లూక్లియర్‌ ఫోర్స్‌ను ఆదేశించారు. ఈమేరకు అణు పరీక్షలు కూడా చేసింది. దీంతో ఉక్రెయిన్‌ కూడా మిత్ర దేశాల అండతో దూకుడు పెంచాలని భావిస్తోంది. రష్యాపై ఏకంగా క్షిపిణి దాడులు చేస్తామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలñ న్‌స్కీ ప్రకటించారు. ఈమేరకు అనుమతి ఇవ్వాలని మిత్రదేశాలను కోరాడు. దీంతో రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం కూడా మరింత ముదురుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ప్రతిదాడికి రెడీ..
    ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడుతూ ‘రష్యా ఉక్రెయిన్‌ భూభాగంలో ఉత్తర కొరియా సైనికులను ప్రతీ స్థావరాలు, వారి అన్ని శిబిరాలను మేం గమనిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో దాడిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే మేం కచ్చితంగా ప్రతిదాడి చేసే అవకాశం ఉంది. ఉక్రేనియన్లపై దాడి చేయడం కోసం ఉత్తర కొరియా సైన్యం ఎదురు చూస్తోంది. రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలన దీటుగా ఎదుర్కొనాలంటే క్షిపుణులు ప్రయోగించాలి. అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరం మా వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంది. దాడులను అడ్డుకోవడానికి వినియోగిస్తామని వెల్లడించారు.

    ముదురుతున్న యుద్ధం..
    పరిస్థితి చూస్తుంటే ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం కూడా ముదురుతున్నట్లే కనిపిస్తోంది. ఇరు దేశాలకు మద్దతు తెలిపే దేశాలు రెండుగా విడిపోయాయి. మరోవైపు అమెరికా ఉక్రెయిన్‌ కోసం రష్యాకు మద్దతు ఇస్తున్న దేశాలపై ఆంక్షలు విధిస్తోంది. ఇది రష్యా అనుకూల దేశాలకు మరింత కోపం తెప్పిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రష్యాకు పరోక్షంగా మద్దతు ఇస్తున్న దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా యుద్ధరంగంలోకి దిగే ప్రమాదం ఉంది.