చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ బొప్పాయిని ఇష్టపడతారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్లు బొప్పాయి తింటే ఆ సమస్య దూరమవుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు చర్మ సమస్యలను తగ్గించడంలో బొప్పాయి సహాయపడుతుంది.
అయితే బొప్పాయిని తినేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. బొప్పాయిని ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. కొంతమంది వ్యక్తులు బొప్పాయి పండ్లను అస్సలు తీసుకోకూడదు. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు బొప్పాయి పండ్లు తినకూడదు. వీళ్లు బొప్పాయి పండు తింటే గుండె వేగం తగ్గే అవకాశం ఉంది. బొప్పాయి తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
ఇప్పటికే షుగర్ సమస్యతో బాధ పడుతున్న వాళ్లు సైతం బొప్పాయి పండ్లను తీసుకోకూడదు. సాధారణం కంటే శరీరంలో రక్తం ఎక్కువగా ఉన్నవాళ్లు సైతం బొప్పాయి పండ్లను తీసుకోకూడదు. కామెర్ల సమస్యతో బాధ పడేవాళ్లు సైతం బొప్పాయి పండ్లను అస్సలు తీసుకోకూడదు. బొప్పాయిలో బీటా కెరోటిన్ తో పాటు పాపైన్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి కామెర్ల సమస్యను మరింత పెంచే ఛాన్స్ ఉంది.
గర్భిణీ స్త్రీలు సైతం బొప్పాయి పండ్లను తీసుకోకూడదు. బొప్పాయి వల్ల వేడి చేసే అవకాశం ఉండగా బొప్పాయిని తింటే కొన్నిసార్లు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ సమస్యలు ఉన్నవాళ్లు బొప్పాయి పండ్లకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.
