నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 782 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల నుంచి 27వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. https://pb.icf.gov.in/act/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా ఇంటర్ పాస్ కావాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి. 2021 సంవత్సరం అక్టోబర్ 26 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితి విషయంలో సడలింపులు ఉంటాయి. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుండగా అకడమిక్ అర్హతల ద్వారా అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తారు.
వెబ్ సైట్ ను సందర్శించి నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఆ తర్వాత దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేసి దరఖాస్తు చేసిన తర్వాత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.