Homeక్రీడలుCricket : ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడి రక్తం కల్లచూసిన పాకిస్తాన్ క్రికెటర్లు

Cricket : ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడి రక్తం కల్లచూసిన పాకిస్తాన్ క్రికెటర్లు

Cricket : పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఆఫ్గాన్ బ్యాటర్లకు పరుగులు రాకపోగా, పాకిస్తాన్ బౌలర్ల నిప్పులు చిమ్మే బంతులకు ఆఫ్గాన్ బ్యాటర్లు రక్తం చిందించాల్సి వచ్చింది. పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు టీ20 మ్యాచ్ లు ఆడగా, మూడో టి20లో పాకిస్తాన్ బౌలర్లు దాటికి ఆఫ్గాన్ బ్యాటరీ విలవిల్లాడారు. పరుగులు రాకపోగా గాయాలు పాలు కావాల్సి వచ్చింది.

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు t20 మ్యాచ్ ల ద్వైపాక్షిక సిరీస్ యూఏఈ వేదికగా జరిగింది. మొదటి రెండు మ్యాచ్లను ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెల్చుకొని సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదటి టీ20లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 92 పరుగులకు పరిమితం కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి విజయం సాధించింది. మొదటి టీ20 ఓటమి తర్వాత రెండో టి20 ఈ నెల 26న జరిగింది. ఈ మ్యాచ్ లోనూ పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేయగా, లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించి విజయం సాధించింది.

మూడో టి20 లో పాకిస్తాన్ విజయం..

మొదటి రెండు టీ20 ఓటమితో సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ జట్టు మూడో టి20 మాత్రం గెల్చుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి కసిగా కనిపించిన పాకిస్తాన్ ప్లేయర్లు అంతే కసితో ఆట ఆడారు. మూడో టి20 లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. 183 పరుగులు లక్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 18.4 ఓవర్లలో 116 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మూడో టి20 లో పాకిస్తాన్ 66 పరుగులు తేడాతో విజయం సాధించింది.

కసితో ఆడిన ప్లేయర్లు..

ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై వరుస రెండు టీ20 మ్యాచ్లో ఓటమి పాలు కావడంతో పాకిస్తాన్ జట్టు ప్లేయర్లు జీర్ణించుకోలేకపోయారు. మూడో టి20 లో ఎలాగైనా విజయం సాధించాలని లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లు భారీగా పరుగులు సాధించారు. ఓపెనర్ షైమ్ అయూబ్ 40 బంతుల్లో 49 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 25 బంతుల్లో 31 పరుగులు, షఫీ క్యూ 13 బంతుల్లో 23 పరుగులు, షాదాబ్ ఖాన్ 17 బంతుల్లో 28 పరుగులు చేయడంతో పాకిస్తాన్ భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచింది.

నిప్పులు చెరిగే బంతులతో..

ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు పాకిస్తాన్ నుంచి నిప్పులు చెరిగే బంతులతో బౌలర్లు స్వాగతం పలికారు. సాదాబ్ ఖాన్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకొని తన స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘనిస్తాన్ ను చుట్టేశాడు. ఇన్షానుల్లా నాలుగు వార్ల బౌలింగ్ చేసి 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ నడ్డి విరిచాడు. ఇమాద్ వాషిమ్, మహమ్మద్ వాషిమ్ జూనియర్, జమన్ ఖాన్, మహమ్మద్ నవాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు పరుగులు రావడం కష్టమైంది. మూడు వికెట్లు తీసిన ఫాక్ బౌలర్ ఇన్షానుల్లా బౌలింగ్లో వేసిన ఒక బౌన్సర్ ను ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ నజీబుల్లా జద్రాన్ దవడకు బలంగా తాకడంతో రక్తం కారింది. నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular