Homeక్రీడలుBCCI- PCB: బీసీసీఐ లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ నిలబడదా? అసలు నిజం ఏంటి?

BCCI- PCB: బీసీసీఐ లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ నిలబడదా? అసలు నిజం ఏంటి?

BCCI- PCB: క్రికెట్ ను ఇంగ్లాండ్ కనిపెట్టవచ్చు. ఆస్ట్రేలియా లాంటి జట్టు నాలుగు సార్లు విశ్వవిజేతగా నిలిచి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ ప్రపంచ క్రికెట్ ను ఏలుతోంది భారత జట్టు. ఒకరకంగా చెప్పాలంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారతదేశం చెప్పినట్టు వినాల్సిందే. ఎందుకంటే 90% నిధులు భారతదేశం నుంచే వస్తున్నాయి కాబట్టి. పైగా భారత జట్టుపై స్పాన్సర్లు కురిపించే కనక వర్షం.. మిగతా ఏ జట్టు పై ఉండదు. అక్కడి దాకా ఎందుకు భారత్లో ఏటా నిర్వహించే ఐపీఎల్ క్రికెట్ టోర్నీ ద్వారా వచ్చే మొత్తం.. ఆయా దేశాలు మూడేళ్లపాటు క్రికెటర్లకు ఇచ్చే జీతభత్యాలతో సమానం. ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ నే ఐపిఎల్ దాటేసింది అంటే అతిశయోక్తి కాదు.. అందుకే ప్రపంచ క్రికెట్ సమాఖ్యలో భారత్ పెత్తనం ఎక్కువ.

BCCI- PCB
BCCI- PCB

మాటలు రేపిన మంటలు

భారత క్రికెట్ సంఘం కార్యదర్శిగా జై షా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో కలకలం రేపుతున్నాయి. వచ్చే ఏడాది పాకిస్తాన్లో ఆసియా కప్ నిర్వహించనున్నారు. అయితే ఈ టోర్నీలో తాము పాల్గొనబోయేది లేదని జై షా స్పష్టం చేశాడు. క్రీడాకారుల భద్రత దృష్ట్యా తాము ఆ సాహసం చేయబోమని వివరించాడు. భారత క్రీడాకారులు ఆ టోర్నీలో పాల్గొనాలంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని పేర్కొన్నాడు. అయితే జై షా అలా ఎందుకన్నాడో కారణం లేకపోలేదు. గత కొద్ది సంవత్సరాల నుంచి సీమాంతర ఉగ్రవాదంతో పాకిస్తాన్ కాశ్మీర్లో హింసకు పాల్పడుతున్నది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పలు వేదికలపై భారత్ కు వ్యతిరేకంగా గళం విప్పుతోంది. పైగా భారత్ లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదిని వెనకేసుకొస్తున్నది. దీంతో గత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జై షా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

వీడియో హల్ చల్

జై షా వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ రమీజ్ రాజా పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రాజా ప్రపంచ క్రికెట్లో భారత ప్రాముఖ్యత వివరిస్తూ, వారి మద్దతు లేకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కుప్పకూలిపోవచ్చు అని మాట్లాడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది..” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 50% ఐసీసీ నిధులపై నడుస్తోంది. ఐసీసీ కి వచ్చే నిధుల్లో భారత మార్కెట్ నుంచి 90 శాతం వరకు వస్తాయి. కాబట్టి భారతీయ వ్యాపార సంస్థలు పాకిస్తాన్ క్రికెట్ ను నడుపుతున్నాయి.. ప్రధానమంత్రి మోడీ పాకిస్తాన్ కు ఎలాంటి నిధులు మంజూరు చేయకూడదని నిర్ణయిస్తే ఈ క్రికెట్ బోర్డు కుప్పకూలవచ్చు అని” రాజా వీడియోలో చెప్పినట్టు తెలుస్తోంది.

BCCI- PCB
BCCI- PCB

2008 నుంచి

2008లో ముంబై దాడి జరిగినప్పటి నుంచి ఈ విదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2006లో భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించింది. ఆ తర్వాత తటస్థ వేదికల్లో మాత్రమే పాకిస్తాన్ పై భారత్ ఆడింది. పైగా పాకిస్తాన్లో శ్రీలంక జట్టుపై దాడి జరిగిన తర్వాత ఇటీవల కాలం నుంచే పలు దేశాలు పాకిస్తాన్లో పర్యటిస్తున్నాయి. భారత్ లో పాకిస్తాన్ చివరి సారిగా 2012 లో పర్యటించింది. గత ఏడాది భారత్ లో ఆసియా కప్ నిర్వహించాల్సి ఉండగా.. పాకిస్తాన్ కు భద్రత కల్పించలేదని బీసీసీఐ స్పష్టం చేయడంతో యూఏఈ లో పోటీలు నిర్వహించారు. అయినప్పటికీ అక్కడి నుంచి కూడా బీసీసీఐకి భారీగానే ఆదాయం వచ్చింది. సో ఈ లెక్కన చూసుకుంటే భారత క్రికెట్ సమాఖ్య ప్రపంచంలో ఈ మూలనైనా క్రికెట్ మ్యాచ్లు ఆడించగలదు. కానీ ఇదే సత్తా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లేదు. అందుకే రమీజ్ రాజా అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీన్ని బీసీసీ అధ్యక్షుడు కావడంతో జై షా పెత్తనం మరి ఎక్కువైపోయింది. అందుకే అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. కాగా ఆసియా కప్ కు సంబంధించి ఇప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయ్యాయని, ఇప్పుడు భారత జట్టు ఇలా చేస్తే వచ్చే ఏడాది ఇండియాలో నిర్వహించే వరల్డ్ కప్ మ్యాచ్ లకి తాము దూరంగా ఉంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular