Oxford University Research: జీవితం ఎన్నో కష్టాలు, సుఖాలతో కలిగి ఉంటుంది. కానీ ఎవరైనా ప్రశాంతతను మాత్రమే కోరుకుంటుంటారు. అయితే అన్నివేళలా ప్రశాంతంగా ఉండాలంటే సాధ్యం కాదు. ప్రస్తుత కాలంలో ఉద్యోగం, వ్యాపారం కారణంగా ఎన్నో రకాల ఒత్తిడిలో ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు సైతం తమ చదువుల విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు లేదా, వారంలో ఒకసారి అయినా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి. అప్పుడే శరీరానికి ఎనర్జీ వచ్చినట్లు అవుతుంది. అయితే ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఏం చేయాలి? ఎవరితో కలిసిమెలిసి ఉండాలి? దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా?
సాధారణంగా కొందరు ఒత్తిడి నుంచి బయటపడడానికి రకరకాల వ్యసనాల బారిన పడతారు. కానీ ఇలా వ్యసనాల బారిన పడటం వల్ల తాత్కాలికంగా మాత్రమే మనసు ప్రశాంతంగా మారుతుంది. దీర్ఘకాలికంగా అనేక రోగాల బారిన వాడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపే ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అది బంధువులతో కావచ్చు లేదా స్నేహితులతో కావచ్చు.. కుటుంబ సభ్యులతో కావచ్చు.
కుటుంబ సభ్యులతో ప్రతిరోజు సంతోషంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ ఏదో కారణం వల్ల చిన్న చిన్న వివాదాలు ఉంటూనే ఉంటాయి. కానీ అబ్బాయిలు మాత్రం స్నేహితులతో మాత్రం ఉల్లాసంగా ఉండేవారు ఎక్కువగా ఉంటారు. కుటుంబ సభ్యులతో పంచుకోలేని విషయాలు స్నేహితులతో పంచుకునే వారు చాలామంది ఉన్నారు. ఒక మంచి స్నేహితుడు ఉంటే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కష్టంలో గానీ, సంతోషంలో గాని మంచి స్నేహితుడు మాత్రమే తోడుంటాడు. అలాంటప్పుడు కొందరు స్నేహితులను ఎప్పటికీ వదులుకోకుండా ఉండాలి.
Also Read: అత్యధికంగా మద్యం సేవించే టాప్ 5 రాష్ట్రాలు ఇవే..
ఇటీవల అమెరికాకు చెందిన Oxford యూనివర్సిటీ తేల్చిన పరిశోధనల ప్రకారం.. ప్రతి వారంలో కనీసం ఒకసారైనా స్నేహితులను కలవాలని తెలుపుతున్నారు. ఎందుకంటే స్నేహితులను కలవడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. శరీరంలో ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది. దీంతో వారం పాటు ఎనర్జీని కలిగి ఉంటారు. ఇలా వారంలో లేదా కనీసం నెలకు ఒకసారైనా స్నేహితులతో కలిసి ఒకరోజు గడపడం వల్ల ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. ఇటువంటి స్నేహితులు లేని వారితో పోలిస్తే.. వీరు ఎంతో ఎనర్జిటిక్ గా ఉన్నట్లు పరిశోధనలు తేలింది. ఏదైనా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కూడా వీరే ఉత్సాహంగా ఉన్నట్లు పరిశోధనలు తేలింది.
Also Read: ప్రతి రోజు తలస్నానం చేయవచ్చా? షాంపూ కూడా ప్రతి రోజు ఉపయోగించవచ్చా?
అందువల్ల ఎటువంటి ఒత్తిడిలో ఉన్నా.. ఎంత బిజీ వాతావరణం లో ఉన్నా.. వారంలో ఒకసారైనా స్నేహితులతో గడపాలని పరిశోధకులు తెలుపుతున్నారు. అయితే ఈ స్నేహితులు మంచి వారై ఉండాలి. ఈర్ష, ద్వేషం, ఇతర చెడు గుణాలతో ఉన్న స్నేహితులతో ఉండటంవల్ల అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. మంచి స్నేహితులతో ఉండడం వల్ల మాత్రమే సంతోషంగా గడపగలుగుతారు. రోజు చేసే వ్యాయామం లేదా ఇతర ఆరోగ్య కార్యక్రమాలకంటే ఇలా స్నేహితులతో ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని పేర్కొంటున్నారు. అందువల్ల ప్రణాళికలో భాగంగా స్నేహితులతో ఉల్లాసంగా ఉండే ఏర్పాటు చేసుకోండి.