Friday: సాధారణంగా శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తాము. ఈ క్రమంలోనే అమ్మవారి కరుణాకటాక్షాలు కోసం పెద్దఎత్తున శుక్రవారం అమ్మవారికి పూజలు చేయడం సర్వ సాధారణం. ఇలా అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారి పూజ చేయడమే కాకుండా కొన్ని నియమ నిబంధనలను పాటించడం వల్ల మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది.శుక్రవారం కేవలం అమ్మవారికి మాత్రమే కాకుండా శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….
Also Read: 2022 వ సంవత్సరంలో ఈ రాశి వారికి మొత్తం సమస్యలే..!
ముఖ్యంగా శుక్రవారం వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. శుక్రవారం భక్తి శ్రద్ధలతో వారిని పూజించడంతో పాటు ఈ నియమాలను పాటించడం వల్ల మనకు ఆర్థికాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.సాధారణంగా మనం ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో ఇంటిలో లైట్లన్నీ ఆర్పి నిద్రపోతాము.కానీ శుక్రవారం మాత్రం ఇంట్లో తప్పనిసరిగా ఈశాన్య దిశ వైపు ఏదైనా ఒక లైట్ లేదా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ఎంతో సులువైన మార్గం ఏర్పడుతుంది.
శుక్రవారం ఆవుకు పచ్చగడ్డి తినిపించడం ఎంతో శుభప్రదం. మీరు భోజనం చేయడానికి ముందు ఆవుకి నెయ్యి బెల్లం కలిపిన అన్నాన్ని పెట్టాలి. శుక్రవారం గోమాతకు పూజ చేయడం వల్ల వారి వెంట లక్ష్మీదేవి ఉంటుంది.అలాగే చాలామంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు అలాంటి వారు శుక్రవారం సాయంత్రం పంచముఖ దీపాన్ని వెలిగించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక నిత్యం అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలంటే అమ్మవారికి హారతి కర్పూరం ఇచ్చి ఆ బూడిదను పరసులో ఉంచుకోవడం వల్ల అదృష్టం మీ వెంట ఉంటుంది.అలాగే శుక్రవారం సాయంత్రం భర్త తన భార్యకు బహుమతి ఇవ్వడం వల్ల వారి మధ్య జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది.
Also Read: పిల్లలు ఫోన్ తరచూ వాడకుండా తల్లిదండ్రులు చేయాల్సిన పని ఇదే