Homeజాతీయ వార్తలువ్యతిరేక పవనాలు.. జమిలీ ఎన్నికలకు మోడీ బ్రేక్

వ్యతిరేక పవనాలు.. జమిలీ ఎన్నికలకు మోడీ బ్రేక్

PM Modi
తమ హయాంలో ఎలాగైనా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే దీనిపైనే కసరత్తు కూడా చేశారు. వాస్తవానికి 2022లో జమిలీ ఎన్నికలకు వెళ్లాలనేది మోడీ ఆలోచన. కానీ.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు తమకు అనుకూల ఫలితాలు ఇచ్చేలా కనిపించడం లేదని స్పష్టం అవుతోంది. దీంతో జమిలీ ఎన్నికలకు వెళ్ల కూడదనే నిర్ణయానికి మోడీ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రస్తుతమున్న వ్యతిరేకత తగ్గిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.

Also Read: బ్రేకింగ్: టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. తీవ్ర ఉద్రికత్త

యథా ప్రకారం లోక్ సభ ఎన్నికలు 2024లోనే జరగనున్నట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా ప్రజల్లో అసహనం పెరుగుతోంది. కేంద్రంపై రోజురోజుకూ వ్యతిరేకత సైతం తీవ్రం అవుతోంది. దాదాపు వంద రూపాయలకు పెట్రోలు చేరుకోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా నింగినంటాయి.

మరోవైపు.. దేశాన్ని నిరుద్యోగ సమస్య కూడా వేధిస్తోంది. దీంతో యువత కూడా కేంద్ర ప్రభుత్వంపై కోపంతోనే ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమకు ఉద్యోగాలేవంటూ మోడీ ప్రభుత్వాన్ని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బీజేపీ నేతలు కూడా ముందుగానే ఊహించినట్లున్నారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి అనుకూల పరిస్థితులు లేవు.

Also Read: వైరల్: విశాఖ ఉక్కు ఉద్యమంపై చిరంజీవి సంచలన ట్వీట్

ఈ పరిస్థితుల్లో వెంటనే జమిలీ ఎన్నికలకు వెళితే ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. రెండేళ్ల పాలనను ఎందుకు పోగొట్టుకోవాలన్న యోచన కూడా మోదీ టీంలో ప్రారంభమయినట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్లలో ప్రజల్లో అసంతృప్తిని తగ్గించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో మోదీ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కే క్షేత్రస్థాయిలో అనుకూల వాతావరణం ఉందని భావిస్తున్నారు. అందుకే మోదీ జమిలీ ఎన్నికల ఆలోచనను పక్కన పెట్టారని సమాచారం అందుతోంది. 2024లోనే సాధారణ ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version