Omicron: దేశంలో కరోనా కలకలం ఇంకా తొలగిపోవడం లేదు. కొత్త వేరియంట్ల రూపంలో వైరస్ తన ప్రభావం చూపుతోంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా ఒమిక్రాన్ కూడా అదే కోవలో ప్రజలను ఆందోళనలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ జోరు తగ్గుతుందని అనుకుంటున్న సమయంలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేపుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య రెట్టింపు కావడంతో మూడో దశ ముప్పు ఇంకా తొలగిపోలేదని తెలుస్తోంది.

ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ తో దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తొలిసారిగా మూడున్నరేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ సోకినట్టు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్లు పెద్దవారికే సోకిన ఒమిక్రాన్ ఇప్పుడు చిన్నారిపై పంజా విసరడంతో భయాందోళన కలుగుతోంది. కరోనా మొదటి, రెండో దశలో సృష్టించిన భయోత్పాతం నుంచి తేరుకునే సమయంలో ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి వచ్చే సూచనలు ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి.
Also Read: ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ కు ఛాన్స్.. కేంద్రం కీలక సూచనలు..!
వచ్చే ఫిబ్రవరి నాటికి మూడో దశ ముప్పు వస్తుందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరించడం భయాందోళనకు కారణమవుతోంది. మూడున్నరేళ్ల చిన్నారికి సోకడంతో ఉన్నతాధికారులు మరోసారి హెచ్చరికలు చేస్తున్నారు. ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు. చిన్నారి కేసు మహారాష్ర్టలో వెలుగు చూడటం గమనార్హం.
మహారాష్ర్టలో మొత్తం కేసులు 17కు చేరాయి. రాజస్తాన్ లో 9, గుజరాత్ లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో 1 కేసులతో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. దీంతో ప్రజల్లో ఆందోళనలు పెరిగుతున్నాయి. మొదటి, రెండో డోసులు టీకా వేసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ సోకవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ప్రమాదం ప్రజల్లో ఆందోళన పెరిగేలా చేస్తోందని తెలుస్తోంది.
Also Read: ‘ఒమిక్రాన్’ భయం: దేశంలో మళ్లీ లాక్ డౌన్ వస్తుందా?