Numerology : ధనవంతులు కావాలని చాలామందికి ఉంటుంది. కానీ అందరికీ అనుకున్న ఆదాయం రాదు. కొందరు ఎంత కష్టపడినా ఆదాయం సరిపోదు. మరికొందరు ఏ పని చేయకుండా ఏదోరకంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. అయితే ఇది వారి జాతక ప్రకారమేనని కొందరు పండితులు చెబుతూ ఉంటారు. కొందరు పుట్టగానే ధనవంతులుగా మారుతారు.. వారి జన్మించిన తేదీని బట్టి.. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో వారికి ఈ పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అయితే చాలామంది తక్కువ ఏజ్ లోనే ధనవంతులు కావాలని కోరుతూ ఉంటారు. ఇలాంటివారు కొన్ని తేదీల్లో జన్మించడం వల్ల అనుకున్నది సాధిస్తారు. మరి ఆ అదృష్ట తేదీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read : శనీశ్వరుడి ప్రభావం..ఏప్రిల్ 28 నుంచి వీరి ఇంట్లో పండగ వాతావరణం..
ప్రస్తుత కాలంలో డబ్బు ప్రవాహం ఎక్కువగా మారిపోయింది. ఏ విషయంలోనైనా డబ్బు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు సంపాదించడం చాలా అవసరం. అయితే ఇదే సమయంలో తమ జాతకం గురించి కూడా తెలుసుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు. వారి జాతకం ప్రకారం ఎలాంటి పనులు చేయాలో.. ఎలాంటి పనులు చేయకూడదు తెలుసుకోవాలని.. అప్పుడు ఏదైనా దోషం ఉంటే పరిహారం గా మార్చుకోవాలని అంటున్నారు.
జాతకంలో భాగంగా సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులుగా మారిపోతారు. వీరు పుట్టుకతోనే సుఖ జీవితాన్ని పొందుతారు. ఏ నెలలో అయినా 5,14,23 తేదీల్లో జన్మించిన వారు ధనవంతులుగా మారిపోతారు. అలాగే వీరికి తెలివి కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక పనిని చేపట్టినప్పుడు దానిని ధైర్యంగా పూర్తి చేస్తారు. పరిస్థితులు వీరికి అనుకూలంగా మారి మీరు విజయానికి బోధపడుతుంది. అలాగే ప్రతి నెలలో 5 వ తేదీ జన్మించిన వారికి బుధుడి గ్రహం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలపై బుధుడి ఆధిపత్యం ఉంటుంది. దీంతో ఈ గ్రహం అనుకూలంగా ఉన్నవారు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా వ్యాపార, ఉద్యోగాల్లో వీరు రాణిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు డబ్బు అధికంగా సంపాదిస్తారు.
అంతేకాకుండా ప్రతినెల 5వ తేదీన జన్మించిన వారు ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పనుల్లో చురుకుతనం చూపిస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు ఎక్కువగా కలెక్టర్లు, న్యాయవాదులు, వైద్యులు ఉంటారు. అంతేకాకుండా వీరికి సంగీతం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. వీరు ఎటువంటి పరిస్థితి ఎదురైనా భయపడరు. ప్రతి కష్టాన్ని తమకు అనుగుణంగా మార్చుకొని సులువుగా దానిని పరిష్కరించుకుంటారు. అంతేకాకుండా ఎటువంటి సవాళ్లు ఎదురైనా దానిని అధిగమిస్తారు. అయితే ఒక్కోసారి కష్టం వచ్చినప్పుడు వీరికి కొందరు దూరం అవుతూ ఉంటారు. ఒంటరిగానే ఉన్న సమస్యను పరిష్కారం చేసుకుంటారు. ప్రజల్లో ఎక్కువగా పేరు సంపాదించే వీరు డబ్బు సంపాదించడంలో మాత్రం అందరికంటే ముందు ఉంటారు. ఉద్యోగాలు చేసేవారు తోటి వారి కంటే ముందే లక్ష్యాలను పూర్తి చేసి పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.