Shani Dev : శని దేవుడు అంటే అందరికీ భయం వేస్తుంది. కానీ శనిదేవుడి అనుగ్రహం వల్ల కొందరి జీవితాలు అనూహ రీతిలో మారిపోతూ ఉంటాయి. శని దేవుడి అనుగ్రహం ఉంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది. ప్రస్తుతం శని దేవుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. మిగతా అయితే మిగతా వాటి కంటే శని గ్రహం చాలా నెమ్మదిగా సంచరిస్తూ ఉంటుంది. శని గ్రహం ఒక రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటుంది. అయితే ఒక రాశిలో ఉన్న సమయంలో నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు శని దేవుడు. ఇందులో భాగంగా ఏప్రిల్ 28వ తేదీన శని దేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ఐదు రాశుల వారికి మహర్దశ పట్టనుంది. ఈ రాశుల వారు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
Also Read : అక్షయ తృతీయ రోజు వీరు బంగారం కొనుగోలు చేస్తే.. లక్కు లో పడ్డట్లే..
శని ప్రభావం వల్ల మకర రాశికి ప్రయోజనాలు కలగలు ఉన్నాయి. మీ రాశి కలిగిన వారు ఇంతకాలం అనారోగ్యానికి గురైతే ఇప్పుడు వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగులు తమ నైపుణ్యాల ద్వారా ప్రతిభ చూపిస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి జీతం పెరిగే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక భాగాలన్నీ తొలగిపోతాయి. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులకు అనుకోకుండా లాభాలు వస్తాయి. కొత్తగా ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి.
శని ప్రభావం వలన కుంభ రాశిపై ప్రభావం ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులు అనేక విషయాల్లో విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు కొత్తగా లాభాలను పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. అయితే ఊహించిన దానికంటే ఆదాయం రావడంతో కాస్త ఉపశమనం ఉంటుంది. సంబంధాలు మెరుగుపడతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇతరులకు అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.
వృషభ రాశి ఉద్యోగులకు శని ప్రభావం వల్ల అంతా మంచే జరుగుతుంది. మీరు కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కెరీర్ పై ఫోకస్ పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇప్పుడు పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో బాగా లాభాలు వస్తాయి. ఉద్యోగులు అదరపు ఆదాయం పొందుతారు.
మిధున రాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. నిలిచిపోయిన బకాయిలు వసూలు అవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఇప్పటివరకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వీరికి తోటి వారి సహకారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి వారిపై కూడా శని ప్రభావం ఉందనుంది. నీ రాశి వారికి ఏప్రిల్ 28 నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పదోన్నతులు పొందే అవకాశం. కొత్తగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.