Homeలైఫ్ స్టైల్Children : పిల్లలు పుట్టడం లేదా? ఒకసారి ఈ విషయం తెలుసుకోండి.

Children : పిల్లలు పుట్టడం లేదా? ఒకసారి ఈ విషయం తెలుసుకోండి.

పెళ్ళైన ప్రతి మహిళకి అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. కానీ, కొన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టడం ఆలస్యం జరుగుతుంది. కొన్ని సార్లు పుట్టడం కూడా లేదు. ప్రెగ్నెన్సీ రావడం పెద్ద సమస్యగా ఏర్పడుతుంది . ఎంత ట్రై చేసినా నిరాశే మిగులుతుంది. దీంతో ఎంతగానో బాధపడుతున్నారు జంటలు. ట్రీట్‌మెంట్స్‌కి వెళ్లడం వల్ల కూడా కొన్ని సార్లు ఫలితాలు ఉండటం లేదు. అయినా లాభం ఉండటం లేదు. దీనికి కారణం మనం తెలియకుండా ఏదైనా తప్పులు చేస్తున్నామా అని కూడా ఒకసారి ఆలోచించాలి. పిల్లలు కావాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? ఇంతకీ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే వివరాలు నిపుణులు షేర్ చేస్తున్నారు. వీటిని ఫాలో అవ్వడం వల్ల త్వరగా ప్రెగ్నెన్సీ కన్‌ఫామ్ అవుతుందట కూడా. మరి అవేంటంటే?

Children : ఎక్కువగా ఎఫెక్టివ్‌గా ఉండే వర్కౌట్స్ చేయవద్దు. వారానికి ఐదు గంటల కంటే ఎక్కువ వర్కౌట్ చేయవద్దు. దీని వల్ల అండోత్సర్గం తగ్గుతుంది. కాబట్టి, తక్కువ ఎఫెక్ట్ ఉండే వర్కౌట్స్ చేయండి. బరువు ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ప్రెగ్నెన్సీపై ఎఫెక్ట్ మాత్రం పడుతుంది అంటున్నారు నిపుణులు. దీని వల్ల అనుకున్నట్లుగా ప్రెగ్నెంట్ అవడం కష్టం అవుతుంది. కాబట్టి, ఆ సమస్యని దూరం చేయాలంటే మీరు మీ ఎత్తుకి తగ్గట్లు బరువు ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. మీరు ఉండాల్సిన బరువు ఎంత? ఇంతకీ మీరు ఎంత బరువు ఉన్నారనేది చెక్ చేసుకోవడం ముఖ్యం.

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. గుడ్లలోని ఖనిజాలు, అమైనో యాసిడ్స్,విటమిన్స్, కూడా ఫోలికల్ క్వాలిటీని పెంచుతాయి. కాబట్టి, రెగ్యులర్‌గా గుడ్లని తింటే సంతానోత్పత్తి అవకాశం పెరుగుతుంది. ఫోలిక్ యాసిడ్, బి విటమిన్స్ వంటి సంతానోత్పత్తి, ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేసే మెడిసిన్ ఉంటాయి. వీటిని మీరు మీ డాక్టర్ సలహాతో తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మీరు త్వరగా కన్సీవ్ అవుతారు అంటున్నారు నిపుణులు

స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లు మన ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయో.. ప్రెగ్నెన్సీ అవకాశాలను కూడా అలానే తగ్గిస్తాయి. కాబట్టి, వీటికి దూరంగా ఉండండి. ఎక్కువగా స్మోక్, ఆల్కహాల్ తీసుకుంటే అది మీ సంతానోత్పత్తిపై ఎఫెక్ట్ చూపిస్తుంది.

ఓవులేషన్ టైమ్‌లో భార్యాభర్తలు కలవాలి. దీని వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్‌ మెనుస్ట్రువల్ సైకిల్ అయితే ఓవులేషన్ అనేది 11 రోజుల నుంచి 21 రోజుల మద్య జరుగుతుంది. కాబట్టి, ఈ టైమ్‌లో మీరు కలవాలి. దీనివల్ల త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా, చాలా మంది లూబ్రికెంట్స్‌ని వాడతారు. వీటిని మీరు స్పెర్మ్, ఎగ్ ఫ్రెండ్లీ లూబ్రికెంట్స్ వాడడం మంచిది. దీని వల్ల కూడా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper