Problem Solving Tips: ఈ భూమి మీద మనుషులంతా దాదాపు ఒక్కటే అని.. కొందరు అంటుంటారు. మరి వారి జీవితాల్లో తేడా ఎందుకు ఉంటున్నాయి? ఒకరు డబ్బు ఎక్కువగా సంపాదిస్తున్నారు.. మరికొందరు తక్కువగా సంపాదిస్తున్నారు.. ఒకరు నవ్వుతూ బతుకుతున్నారు.. మరికొందరు నిత్యం ఏడుస్తూ ఉన్నారు.. ఇలా వీరి జీవితాల్లో తేడాలు ఎందుకు ఉంటున్నాయి? అనే సందేహం ఉన్నవాళ్లు ఈ స్టోరీ చదవండి..
ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. తనకు జీవితంలో ఎప్పటికీ కష్టాలే ఉంటున్నాయి.. ఎంత ప్రయత్నించినా.. సమస్యలే కనిపిస్తున్నాయి.. నా జీవితం బాగుపడడానికి ఏదైనా మార్గం చూపండి.. అని ఆ శిష్యుడు గురువును అడుగుతాడు. దీంతో గురువు ఒక గ్లాసు నీళ్లు తీసుకురమ్మని అడుగుతాడు. అలాగే ఒక పిరికేడు ఉప్పు కూడా తీసుకు రమ్మంటాడు. ఇప్పుడు గ్లాసులో పిరియడ్ ఉప్పు వేయమని అంటాడు. ఆ నీరు తాగమని అడగగా.. గురువుగారి ఆజ్ఞతో బలవంతంగా సగం వరకు తాగుతాడు. మిగతా సగం తాగలేనని చెబుతాడు. సరైనది చెప్పి ఆ గురువు మరో పిరికెడు ఉప్పు తీసుకు రమ్మంటాడు. ఇప్పుడు ఈ ఉప్పును చెరువు నీటిలో వేయమని అంటాడు. ఆ తర్వాత చెరువు నీరు తాగమని చెబుతాడు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే.. బాగానే ఉన్నాయని శిష్యుడు చెబుతాడు.
అప్పుడు గురువు ఒక ప్రశ్న వేస్తాడు.. గ్లాసులో నీళ్లు ఎలా ఉన్నాయి? చెరువులో నీళ్లు ఎలా ఉన్నాయి? అని అడిగితే చెరువులో నీళ్లు బాగున్నాయి అని ఆ శిష్యుడు చెబుతాడు. అప్పుడు గురువు అంటాడు.. సమస్యలు కూడా పిడికెడు ఉప్పు లాంటివే.. ఆ పిరికేడు ఉప్పు గ్లాసులో వేస్తే తాగలేవు.. చెరువులో వేస్తే తాగుతున్నావు.. సమస్యలు కూడా అంతే గ్లాసులో వేసిన ఉప్పులాగా కాకుండా.. చెరువులో వేసిన ఉప్పు లాగా చూడు.. అప్పుడు నీ సమస్యలు పెద్దగా అనిపించవు అని అంటాడు.
మనిషికి సమస్యలు లేకుండా ఎన్నటికీ జీవితం గడవదు. అయితే ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? వాటిని దాటుకుంటూ ఎలా ముందుకు వెళ్లాలి? అని ఆలోచనలు చేసేవారే గొప్పవారవుతారు. మిగతావారు అక్కడే ఆగిపోతారు. ఎప్పుడైనా తనకు సమస్యలు ఉన్నాయని నిందించకుండా.. వాటిని భూతద్దంలో చూడకుండా.. ముందుకు వెళ్లడమే అసలైన వ్యక్తి పని. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చాలామందికి ఉంటుంది. ఇలాంటి వారికి అడ్డంకులు రావడం సహజం. అయితే ఈ అడ్డంకులను తొలగించుకోవడానికి ప్రయాణాన్ని ఆపొద్దు. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలి. అప్పుడే అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు.