NIT Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 43 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా మ్యాథమేటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగాలతో పాటు ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.

సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో ఈ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉండగా హార్డ్ కాపీలను మాత్రం ఆఫ్ లైన్ లో పంపించాల్సి ఉంటుంది.
Also Read: ఉక్రెయిన్ -రష్యా వార్.. అభాసుపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
రిజిస్ట్రార్, నిట్ జంషెడ్‌పూర్, ఆదిత్యాపూర్, జంషెడ్‌పూర్, జార్ఖండ్–831014 అడ్రెస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. సెమినార్, ఇంటర్వ్యూ, టెస్ట్, ప్రజంటేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. మార్చి 15వ తేదీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా మార్చి 22వ తేదీ హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేదీగా ఉండనుంది.
http://www.nitjsr.ac.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.
Also Read: ఏపీ రాజధానిగా అమరావతి.. గుర్తిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Recommended Video: