Unhealthy Foods: మనలో చాలామంది తిండి విషయంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంతో పోల్చితే రుచిగా ఉండే ఆహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే అలా చేయడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. మనలో కొంతమందికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకుంటే ఒత్తిడితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఉప్పు తగినంత తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అదే స్థాయిలో కీడు జరుగుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది. మనలో చాలామంది స్వీట్లను ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎక్కువ మొత్తంలో స్వీట్లను తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
Also Read: వైసీపీ నుంచి రాజ్యసభకు అదానీ సతీమణి
మనలో చాలామంది కాఫీ, టీలను తెగ ఇష్టపడతారు. కాఫీ, టీలలో కెఫిన్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎక్కువమొత్తంలో కెఫిన్ శరీరంలో చేరితే ఆరోగ్యానికి హాని కలిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మనలో చాలామంది జంకు ఫుడ్ ను ఇష్టపడతారు. తక్కువ సమయంలో తయారు చేసే ఈ జంక్ ఫుడ్ వల్ల శరీరానికి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం ఉండదు.
పోషకాలతో కూడిన ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే మన ఆరోగ్యానికి మేలు జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతిరోజూ అలాంటి ఆహారం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తే మంచిది. శరీరానికి హాని కలిగించే ఆహారం తీసుకుంటే బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.
Also Read: రంగంలోకి యూరోపియన్ దేశాలు.. రష్యాతో ఫైట్ కు ఉక్రెయిన్ కు మిలటరీ సాయం..
Recommended Video: