India vs New Zealand: 177 పరుగుల లక్ష్య చేదన. 33 పరుగులకే మూడు వికెట్లు.. ఇడీ న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో భారత బ్యాటింగ్ ప్రారంభమైన తీరు. ఇలాంటి స్థితిలో జట్టు గెలుస్తుందని ఎలా అనుకుంటాం? పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ ను నిలువరిస్తుందని ఎలా ఊహిస్తాం? నిన్న భారత బ్యాటింగ్ చూసిన తర్వాత సెకండ్ హ్యాండ్ టీం అనిపించింది. అనుకున్నట్టుగానే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.

ఇక ఈ మ్యాచ్ ఓడిపోయేందుకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. అన్ని వేళ్ళు మాత్రం అర్ష్ దీప్ సింగ్ వైపు చూపిస్తున్నాయి. నిన్న చివరి ఓవర్ లో అతడి బౌలింగ్ చూస్తే గల్లి స్థాయి కూడా సరిపోదేమో అనిపించింది.. ఆరు బంతుల్లో 27 పరుగులు సమర్పించాడు అంటే అతని బౌలింగ్ ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఈ ఓవర్ తర్వాతే న్యూజిలాండ్ స్కోర్ 176 పరుగులకు చేరుకుంది.. అతడు కనుక కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. పైగా చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన ఈ ఆటగాడు ఒక ఓవర్ మొత్తం పరుగులు చేయకుండా డిఫెన్స్ ఆడాడు. కనీసం ఒక్క పరుగు తీసి వాషింగ్టన్ సుందర్ కు స్ట్రైక్ ఇచ్చినా బాగుండేది.
ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్ త్రిపాఠి డక్ అవుట్ అయ్యాడు.. ఇతడి ఎంపిక తీరు పట్ల హార్దిక్ పాండ్యా పై విమర్శలు వస్తున్నాయి.. డబుల్ సెంచరీ హీరో గిల్ నిర్లక్ష్యపు షాట్ కు అవుట్ అయ్యాడు.. ఇక ఇషాన్ కిషన్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా మామూలు ఆటతో సరిపెట్టాడు.. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యువకులకు అవకాశాలు కల్పిస్తే… వారు సద్వినియోగం చేసుకోకపోవడంతో జట్టు ఓటమి పాలు కావాల్సి వస్తుంది.. వాస్తవానికి నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బౌలింగ్ కన్నా భారత బ్యాట్స్మెన్ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఇక బౌలింగ్ కూడా ప్రారంభంలో బాగున్నప్పటికీ.. చివరిలో లయతప్పుతోంది. దీనివల్ల ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు సాధిస్తున్నది.. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. చివరి ఓవర్ లో అసలు అర్ష్ దీప్ సింగ్ కు బౌలింగ్ ఇయ్యడమే పాండ్యా చేసిన అతి పెద్ద తప్పు. అతడి బౌలింగ్ లోపాలను అవకాశం గా మలుచుకున్న న్యూజిలాండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.. ఒకే ఓవర్లో 27 పరుగులు పిండుకున్నారు. మొత్తానికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. టీం ఇండియాను ఓడించారు.