https://oktelugu.com/

New Year 2025: మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు.. న్యూ ఇయర్ విషెష్ చెప్పేయండిలా!

సాధారణంగా హిందువులకు అసలు ఇది కొత్త సంవత్సరం కాదు. కానీ దేశంలో చాలా మంది న్యూఇయర్‌ను జరుపుకుంటారు. ఈ క్రమంలో సరదాగా పార్టీలు చేసుకుని న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే న్యూ ఇయర్ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కొత్తగా ఇలా విషెష్ తెలియజేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2024 / 06:54 PM IST

    New Year wishes

    Follow us on

    New Year 2025: అందరూ ఎంతగానో ఎదురు చూస్తే కొత్త ఏడాది 2025 వచ్చేస్తుంది. ఈ కొత్త ఏడాది రోజు అందరూ కూడా తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా విషెష్ తెలియజేస్తారు. కేవలం కలిసి అని కాకుండా.. ఆన్‌లైన్‌లో తెలియజేస్తారు. ప్రస్తుతం అంతా కూడా డిజిటల్ మీడియా అయిపోవడంతో చాలా మంది కలిసి కంటే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ద్వారా మాత్రమే విషెష్ తెలియజేస్తున్నారు. కొత్త సంవత్సరం రోజు సంతోషంగా ఉంటే మిగతా రోజులు హాయిగా ఉంటుందని నమ్ముతారు. సాధారణంగా హిందువులకు అసలు ఇది కొత్త సంవత్సరం కాదు. కానీ దేశంలో చాలా మంది న్యూఇయర్‌ను జరుపుకుంటారు. ఈ క్రమంలో సరదాగా పార్టీలు చేసుకుని న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే న్యూ ఇయర్ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కొత్తగా ఇలా విషెష్ తెలియజేయండి.

    ఈ కొత్త ఏడాదిలో అయిన మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
    12 నెలలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా, ప్రశాంతంగా, హాయిగా ఉండాలని కోరుకుంటూ మీకు కొత్త ఏడాది శుభాకాంక్షలు.
    2025లో మీ కలలు అన్ని కూడా నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్
    ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోయి కొత్త ఏడాదిలో అయిన కూడా కోరికలు నెరవేరాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్
    కొత్త ఏడాది మీకు సంతోషాలు, విజయాలను తీసుకురావాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్
    ఈ ఏడాది జరిగిన చేదు జ్ఞాపకాలు అన్ని కూడా మరిచిపోయి కొత్త కోరికలతో కొత్త సంవత్సరంలో హాయిగా జీవించాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్
    కొత్త సంవత్సరం పుస్తకంలో అన్ని పేజీలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    ఈ ఏడాది మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి హాయిగా జీవించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
    నీ ఆశలు, కోరుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
    నువ్వు కన్న కలలు అన్ని నెరవేరాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్
    కొత్త సంవత్సరంలో భగవంతుని ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్
    ఈ న్యూ ఇయర్ మీకు అంతులేని ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
    నవ్వు, ఆనందం, మరపురాని జ్ఞాపకాలతో మీ కొత్త సంవత్సరం సుఖ, శాంతులతో ఉండిపోవాలని కోరుకుంటూ.. నూతన సంవత్సరం శుభాకాంక్షలు
    ప్రేమ, ఆరోగ్యం, శ్రేయస్సుతో కొత్త సంవత్సరం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
    కొత్త సంవత్సరం, కొత్త కలలు విజయాల వైపు వెళ్లాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
    మీ హృదయం కృతజ్ఞత, ఆశలతో ఈ ఏడాది నిండి ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సరం శుభాకాంక్షలు
    ప్రేమతో నిండిన చేతులు, హృదయాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదామని.. నూతన సంవత్సర శుభాకాంక్షలు