https://oktelugu.com/

Ram Charan World Record : 256 అడుగుల కటౌట్..హెలికాఫ్టర్ పై నుండి పూలాభిషేకం..దేశంలో ఏ హీరోకి ఇలా జరగలేదు..చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ఫ్యాన్స్!

నేడు దిల్ రాజు విజయవాడ లో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ కటౌట్ లాంచ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు.ఈ కటౌట్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. 256 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కటౌట్ ప్రపంచం లోనే అత్యంత భారీ కటౌట్ గా రికార్డు ని నెలకొల్పింది.

Written By:
  • Vicky
  • , Updated On : December 29, 2024 / 06:59 PM IST
    Follow us on

    Ram charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మరో 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ జనవరి 1 నుండి గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆరోజే విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ కోసం అభిమానులు సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా మూవీ టీం ని ట్యాగ్ చేసి ఏ రేంజ్ లో నిరసన వ్యక్తం చేస్తూ అడుగుతున్నారా మనమంతా చూసాము. ఒక అభిమాని ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ లేఖ కూడా రాసిన ఘటన పెద్ద సంచలనం గా మారింది. అయితే ఎట్టకేలకు నేడు దిల్ రాజు విజయవాడ లో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ కటౌట్ లాంచ్ ఈవెంట్ లో అధికారికంగా ప్రకటించాడు.

    ఈ కటౌట్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. 256 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ కటౌట్ ప్రపంచం లోనే అత్యంత భారీ కటౌట్ గా రికార్డు ని నెలకొల్పింది. ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్ విజయవాడ లో గ్రాండ్ గా నిర్వహించగా, ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. కటౌట్ పైన హెలికాఫ్టర్ ని తిప్పుతూ పూల వర్షం కురిపించారు అభిమానులు. దేశం లో ఇప్పటి వరకు ఏ హీరో కి కూడా ఇలా అభిమానులు చేయలేదు. ఆ విధంగా రామ్ చరణ్ మీద తమకి ఉన్నటువంటి అపరితమైన అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్ కి పది వేల మందికి పైగా అభిమానులు హాజరైనట్టు తెలుస్తుంది. అసంఖ్యాకంగా అభిమానులు వస్తుండడంతో పోలీసులకు అదుపు చేయడం కాస్త కష్టమైంది. కటౌట్ లాంచ్ ఈవెంట్ కి ఈ రేంజ్ జనాలు వచ్చారంటే, ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎలా వస్తారో ఊహించుకోవచ్చు.

    ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచేయబోతున్నట్టు దిల్ రాజు నేడు అధికారిక ప్రకటన చేసాడు. నేడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చానని, ఆయన డేట్స్ ఇచ్చే దానిని బట్టి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తామని , ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా అభిమానులు విజయవంతం చేయాలనీ ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాని మధ్యాహ్నమే మెగాస్టార్ చిరంజీవి గారు చూసారని, ఇక్కడికి వచ్చే సమయం లో ఆయన నాకు ఫోన్ చేసి సంక్రాంతికి ఈసారి మామూలుగా కొట్టడం లేదని అభిమానులకు చెప్పు అని అన్నాడని దిల్ రాజు వ్యాఖ్యానించాడు. ఇందులో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని, అభిమానులకు ప్రారంభ సన్నివేశం నుండి చివరి వరకు గూస్ బంప్స్ రావడం తథ్యం అని దిల్ రాజు మాట్లాడారు.