Vastu Tips: వాస్తు టిప్స్ ఇంట్లో ఈ చిన్న మార్పులతో నెగెటివ్ ఎనర్జీని దూరం చేయండి..

జీవితమంటే పూల పానుపు కాదు. కష్ట సుఖాలతో నిండి ఉంటుంది. అయితే ఎప్పటికీ కష్టం లేదా ఎప్పటికీ సంతోషం ఉండదు. కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు ఇతరులతో పంచుకోవాలి. కష్టాల నుంచి గట్టెక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని ఆధ్యాత్మిక మార్పులు చేయడం వల్ల జీవితం మారే అవకాశం ఉంది‌

Written By: Srinivas, Updated On : November 6, 2024 4:49 pm

Vastu-tips

Follow us on

Vastu Tips: జీవితమంటే పూల పానుపు కాదు. కష్ట సుఖాలతో నిండి ఉంటుంది. అయితే ఎప్పటికీ కష్టం లేదా ఎప్పటికీ సంతోషం ఉండదు. కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు ఇతరులతో పంచుకోవాలి. కష్టాల నుంచి గట్టెక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని ఆధ్యాత్మిక మార్పులు చేయడం వల్ల జీవితం మారే అవకాశం ఉంది‌. ముఖ్యంగా ఇంట్లో ఎప్పుడు చికాకు, ఉద్రిక్త వాతావరణం ఎదుర్కొంటున్న వాళ్లు కొన్ని వాస్తు టిప్స్ పాటించడం వల్ల ఇల్లును సంతోషంగా మార్చుకోవచ్చు. ఇప్పటివరకు ఇంట్లో లేని వస్తువులు ను కొన్నింటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయి అనుకోని అదృష్టం కలిగే అవకాశం ఉంది. దీంతో ధనంతో పాటు సంతోషం కూడా కలగనంది. మరి పాజిటివ్ తీసుకొచ్చి ఆ వస్తువు లేవు తెలుసుకుందాం.

కొందరి వ్యాపార సముదాయాల్లో తాబేలు విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. అయితే చాలామంది ఇది ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో తెలియక సందేహ పడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహం ఉన్నచోట అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా ఇది ఉన్నవాళ్లు కు రాజయోగం ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉండి సంతోషంగా ఉంటారు. అందువల్ల ఇప్పటివరకు కష్టాలు ఎదుర్కొంటున్న వారు తాబేలు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

నెమలి ఈకల గురించి చిన్నప్పుడు చూశాం. కానీ నెమలి ఈకలు ఇంట్లో ఉండడం వల్ల సంతోషమైన వాతావరణముంటుంది. అయితే నెమలి ఈకలను ఇంట్లో ఉంచుకోవాలని అనుకునేవారు దీనిని పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలి. ఇది ఉన్న ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ సంతోషాన్ని అందిస్తుంది. అంతేకాకుడా కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకోని అదృష్టం వస్తుంది. ఇది ఇంట్లో ఉండడం వల్ల ఇల్లంతా సందడిగా మారుతుంది.

ఇంట్లో ఎప్పుడూ సమస్యలతో బాధపడే వారు శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనిని దీపావళి కి ముందు రోజు వచ్చే ధన్ త్రయోదశి సమయంలో ఇంట్లో ఉంచడం వల్ల మరిన్ని ఫలితాలు ఉంటాయి. అయితే మధ్యలోనూ కొన్ని మంచి రోజుల్లో దీనిని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఐశ్వర్యవంతులుగా మారుతారు. ముఖ్యంగా వ్యాపార వేత్తలు తమ వ్యాపార సముదాయాల్లో దీనిని ఉంచడం వల్ల అధిక లాభాలు పొందుతారు. దీనిని తూర్పున, పడమర దిశలో ఉంచాలి.

ఇంట్లో అనుకోకుండా అనారోగ్యాలకు గురవ్వాల్సి వస్తే క్రిస్టల్ బౌల్ లో నీటితో ఉన్న గులాబీ పూలను ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. దీంతో నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సానుకూలతను వ్యాప్తి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు దీనిని చూడడం వల్ల హాయిగా ఉంటారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల ఇంటికి సంపదను తీసుకొస్తుంది.

మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇంట్లో తోరణాల ఏర్పాటు చేసే క్రమంలో గాలి గంటలు వేసుకోవలి. ఇవి చూడ్డానికి అందంగా ఉంటాయి. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. వీటిని ఉత్తరం, పడమర, వాయువ్యం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ఇంట్ల సానుకూల శక్తి ప్రసారం అవుతుంది