Secrets: కొందరికి నోట్లో మాట ఆగదు. ఎలాంటి విషయం అయినా సరే అందరికీ చెబుతుంటారు. చెప్పకుంట ఉంటే వారికి పాలుపోదు. అందుకే చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా ఎవరో ఒకరితో చెబుతుంటారు. మరి మీరు కూడా ఇలాంటి పనులే చేస్తారా? కానీ కొన్ని విషయాలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పకూడదు. అందులో ఒక ఆరు విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు. అవేంటో తెలుసుకోండి.
1.. మీ ప్లాన్స్ గురించి ఎవరికి చెప్పకూడదు. వాటిని వారు తప్పు పట్టే అవకాశం ఉంటుంది. దీని వల్ల లాస్ అవుతారు. లాభం ఉండదు. అంటూ ఏదో ఒకటి చెబుతూ మిమ్మల్ని పక్కదారి పట్టిస్తారు. అందుకే ఎవరికి మీ విషయాలు చెప్పకండి. రెండవది ఏంటంటే..మీలో ఉన్న వీక్ నెస్ ను కూడా ఎప్పటికీ ఎవరికి చెప్పకూడదు. వారికి మీ వీక్ నెస్ తెలిస్తే మీతో ఆడుకుంటారు. వాటిని బేస్ చేసుకొని మిమ్మల్ని బలహీనులను చేస్తారు. కాబట్టి మీ వీక్ నెస్ ను ఎవరికీ చెప్పకండి.
3..మీ ఫెయిల్యూర్స్ కూడా ఎవరికి చెప్పకండి. వీటి గురించి చెప్పడం వల్ల మీకు అవకాశాలు ఇవ్వరు. మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ లాగానే చూస్తారు. మీరు ఏం సాధించలేరని.. సాధించినా కూడా బై ఛాన్స్ అన్నట్టుగా చూస్తారు. 4..ఏదైనా పెద్ద పని చేస్తున్నప్పుడు సైలెంట్ గా చేసి సక్సెస్ అయిన తర్వాత వారికి షాక్ ఇవ్వండి. కానీ ముందే మీ పెద్ద ప్లాన్ గురించి కూడా చెప్పకండి. ఇలాంటి షాక్ వల్ల వారికి మీ మీద రెస్పెక్ట్ కూడా పెరగవచ్చు. కానీ మీరు సాధించడం వల్ల.. మీ వద్ద ఉన్న డబ్బుల వల్ల మీకు రెస్పెక్ట్ ఇస్తే వారిని కాస్త దూరం పెట్టడమే బెటర్.
5..మీ సీక్రెట్స్ ను కూడా ఎప్పుడు ఎవరికీ చెప్పకూడదు. ఫుల్స్ మాత్రమే సీక్రెట్స్ చెబుతారు అని గుర్తు పెట్టుకోండి. ఇక ఫైనల్ గా 6వ ది మీ ఆదాయం, ఆదాయ సోర్స్ ల గురించి కూడా ఎవరికి చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని గుర్తు పెట్టుకోండి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Never tell anyone these six things
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com