Need to service our bodies : స్కూటీ, కార్, వ్యాన్ వంటి ఏవైనా వాహనాలు ఉంటే కచ్చితంగా మీరు సర్వీస్ చేయిస్తుంటారు కదా. కి. మీటర్ లేదా రీడింగ్ ను బట్టి సర్వీస్ చేయించాలి. అప్పుడే వాహనానికి ఎలాంటి రిస్క్ లేకుండా సూపర్ గా వర్క్ చేస్తుంది. సమస్య వచ్చినప్పుడు సర్వీస్ చేయించడం కాదు. సరైన సమయానికి సర్వీస్ చేయిస్తూ ఉంటే అసలు సమస్య రాదు. అయితే ఈ ట్రిక్ జస్ట్ వాహనాలకే కాదండోయ్. మన బాడీలకు కూడా సర్వీసింగ్ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును మీరు విన్నది నిజమే. మీకు కూడా సర్వీస్ అవసరమే. ఇంతకీ ఈ సర్వీస్ ఎలా చేయించాలంటే?
Also Read: ‘కల్కి’ లాంటి ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిన రామ్ చరణ్..డైరెక్టర్ ఎవరంటే!
ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న రోజుల్లో జీవిస్తున్నాం. ప్రస్తుతం ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో బాధ పడుతున్నారు. కానీ బాడీ సర్వీస్ చేయించడం వల్ల అసలు సమస్యనే రాదు అంటున్నారు నిపుణులు. అయితే ఈ సర్వీస్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. సంవత్సరానికి నాలుగు సార్లు అంటే సర్వీస్ చేయిస్తే ఇక మీకు తిరుగు ఉండదట. ఎనమా చేసి పేగులను క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వారం పాటు ఉపవాసం ఉండాలి. వామ్మో వారం పాటు ఉపవాసమా అని తెగ భయపడవద్దు.
ఇందులో మొదటి మూడు రోజులు హనీ వాటర్ తాగాలి. ఇందులోకి హనీ వాటర్, కొబ్బరి వాటర్, వంటివి ఉంటాయి. ఒక రోజు ఇలా తీసుకొని ఆ తర్వాత జ్యూస్ లు తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్ లు తీసుకుంటూ ఒక రెండు రోజులు ఉండాలి. 3 గంటలకు ఒకసారి జ్యూస్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఒక రెండు రోజులు చేసిన తర్వాత రోజు నుంచి ఫ్రూట్స్ తీసుకోవాలి. అంటే మూడు పూటలు కూడా ఫ్రూట్స్ తీసుకోవాలి. ఉదయం అల్పాహారంలోకి ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ లోకి కూడా ఫ్రూట్స్ ను తీసుకోవాలి. ఇలా సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు మీ బాడీని సర్వీస్ చేయించుకోవాలి.
Also Read: సంచలనం రేపుతున్న బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్… ఎవరూ ఊహించని ట్విస్ట్!
ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు అంటున్నారు నిపుణులు. అయితే మీకు ఈ సర్వీస్ సరిగ్గా అర్థం కాకపోయిన లేదా ఎలా చేయాలి వంటి గందరగోళం ఉన్నా సరే ఆశ్రమంలో చేరవచ్చట. 15 రోజులు ఉండే వర్క్ షాప్ లలో ఇవి మొత్తం నేర్పిస్తారు. ఆ తర్వాత ఎలాంటి ఖర్చు లేకుండా మీరు ప్రతి సంవత్సరం మీ శరీరాన్ని మీరే సర్వీస్ చేయించుకోవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.