Ram Charan: ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) మూవీ షూటింగ్ సమయం లో రామ్ చరణ్(Global Star Ram Charan) రెండు సినిమాలను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి తో చేయాల్సిన సినిమా. ఈ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గ్రాండ్ గా ప్రకటించారు. ఈ సినిమాకు ప్రకటన స్టేజి నుండే అంచనాలు భారీ స్థాయికి చేరాయి. ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి(Gowtham tinnanuri) మంచి విషయం ఉన్న దర్శకుడు. నాని తో చేసిన ‘జెర్సీ’ చిత్రం తో ఆయన తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. రామ్ చరణ్ తో సినిమా కాబట్టి కచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతో గొప్పగా తెరకెక్కిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈ ‘గేమ్ చేంజర్’ షూటింగ్ సమయంలోనే ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది అంటూ డైరెక్టర్ గౌతమ్ స్వయంగా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అధికారిక ప్రకటన చేశాడు.
Also Read: జగపతి బాబు కూతురు పెళ్లి ఆపడానికి ప్రయత్నం చేసినవారు ఎవరు..? వైరల్ వీడియో…
అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనే విషయం రీసెంట్ గానే సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే గౌతమ్ రామ్ చరణ్ కి వినిపించిన స్టోరీ ‘కల్కి'(Kalki 2898 AD) చిత్రం తో పోలి ఉంటుందట. కలియుగం లో పుట్టిన ఒక వీరుడు, తన మూలాలు త్రేతాయుగం, ద్వాపర యుగం లో ఉన్నట్లు గుర్తించడం, ఆ యుగాల్లో అతను చేసిన కర్మలు, చేసిన యుద్దాలు గుర్తుకు రావడం వంటివి ఈ కథలో ఉంటాయట. రామ్ చరణ్ కి ఈ స్టోరీ వినిపించగానే చాలా నచ్చింది. కచ్చితంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుంది అని చాలా బలంగా నమ్మాడు. అయితే యూవీ క్రియేషన్స్ కి ప్రభాస్ ‘కల్కి’ చిత్రం కూడా ఇదే తరహా స్టోరీ లైన్ తో తెరకెక్కుతుంది అనే విషయం తెలిసింది. ఈ విషయం రామ్ చరణ్ కి యూవీ క్రియేషన్స్ వివరించడంతో గౌతమ్ ని ఇంటికి పిలిచి మాట్లాడి, ఈ ప్రాజెక్ట్ ని రద్దు చేసినట్టు సమాచారం.
Also Read: పునర్జన్మ నేపథ్యం లో ‘హరి హర వీరమల్లు’..పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
కచ్చితంగా భవిష్యత్తులో మనం మరో సినిమా చేద్దాము, ఒకే తరహా ప్రాజెక్ట్స్ చేస్తే పాపం కల్కి టీం వాళ్ళు నష్టపోవాలి,మనం కూడా నష్టపోవాల్సి ఉంటుంది అని చెప్పాడట. అలా ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది. దీంతో గౌతమ్ తిన్ననూరి తన దగ్గరున్న మరో కథ తో విజయ్ దేవరకొండ వద్దకు వెళ్ళాడు. విజయ్ దేవరకొండ కి రెండు కథలు వినిపించాడు, అందులో రామ్ చరణ్ కి వివరించిన స్టోరీ కూడా ఉందట. కానీ విజయ్ దేవరకొండ అది కాకుండా వేరే సబ్జెక్టు ని ఎంచుకున్నాడని, అదే ‘కింగ్డమ్’ అయ్యిందని అంటున్నారు. ఇకపోతే వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కింగ్డమ్’ చిత్రం ఈ నెల 31 న విడుదల కాబోతున్నట్టు ఇటీవలే ఒక ప్రోమో వీడియో ద్వారా అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.