New LPG connection: దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నా రోజురోజుకు వినియోగదారుల సంఖ్య సైతం అదే స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. అయితే గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేయాలన్నా, కొత్త గ్యాస్ సిలిండర్ కావాలన్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నంబర్ కు కాల్ చేయడం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.

8454955555 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్ ను పొందవచ్చు. ఈ నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడం లేదా కొత్త గ్యాస్ కనెక్షన్ ను పొందడం సాధ్యమవుతుంది. డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ ను అడ్రస్ ప్రూఫ్ గా ఇస్తే గ్యాస్ కనెక్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. ఒకే ఫ్యామిలీలో రెండో కనెక్షన్ కావాలనుకుంటే దానిని ఓల్డ్ కనెక్షన్ కు అడ్రస్ ప్రూఫ్ గా తీసుకోవచ్చు.
ఇండేన్ గ్యాస్ ను మిస్డ్ కాల్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 7718955555 నంబర్ కు కాల్ చేయడం ద్వారా కూడా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. 7588888824 నంబర్ కు refill అని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి కూడా గ్యాస్ సిలిండర్ ను సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని భావించే వాళ్లకు ఈ ఆప్షన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వాట్సాప్ ద్వారా కూడా సులభ్గంగానే గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు.