Nandini cab driver: నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇటీవల అంతరిక్షంలోనూ ప్రయాణం చేసి పురుషులకు ధీటుగా నిలుస్తున్నారు. అయితే మానవ జీవితంలో ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు. ఒక్కోసారి మనం అనుకున్నది ఒకటైతే.. జరిగేది మరొకటి ఉంటుంది. దీంతో జీవితంపై నిరాశపడుతుంది. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లడమే అసలైన లక్ష్యం. అయితే పురుషులకంటే మహిళలు కొన్ని విషయాల్లో చాలా వెనుకబడి ఉంటారని అంటారు. కానీ వారు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే ఏ పనైనా చేయగలుగుతారు అని ఒక మహిళా నిరూపిస్తుంది. ఓవైపు జీవితం కోసం పోరాటం.. మరోవైపు బిడ్డ కోసం ఆరాటపడుతూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంది. ఇంతకు ఈమె వార్తల్లోకి రావడానికి కారణం ఏంటి?
బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ నందిని పేరు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా మహిళలు క్యాబ్ డ్రైవర్ గా ఉండడం పెద్ద విషయమేమీ కాదు. కానీ నందిని మాత్రం ఒక తల్లిగా కారును నడుపుతూ ఉండడంతో ఒక వ్యక్తి చలించి పోయాడు. నందిని తన బిడ్డతో సహా క్యా డ్రైవర్ గా ఉద్యోగం చేస్తూ ఉండడంతో రాహుల్ అనే వ్యక్తి చలించిపోయి ఆమె విషయాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. ఓవైపు బిడ్డను పక్కనే ఉంచుతూ ఉద్యోగం చేస్తున్న ఈమెను చూసి చాలామంది ఇన్స్పైర్ కావాల్సిన అవసరం ఉందని ఆయన పోస్ట్ చేశాడు.
వాస్తవానికి నందిని ఫుడ్ కోర్టు పెట్టారు. అయితే కరోనా సమయంలో ఇది తీవ్రంగా నష్టం చేకూర్చింది. ఆ తర్వాత ఉపాధి కోసం అనేక ప్రయత్నాలు చేసి చివరికి క్యాబ్ డ్రైవర్ వృత్తిని ఎంచుకుంది. ప్రస్తుతం రోజు 12 గంటల పాటు డ్రైవింగ్ చేస్తూ తన లక్ష్యాలను పూర్తి చేసేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. అయితే నందిని తాను డ్రైవర్ గా పనిచేయడమే కాకుండా మాకు ఒక అమ్మగా తన బిడ్డకు ఎన్నో సేవలు చేస్తుంది. అయితే ఇటీవల కాలంలో తనతో పాటు తన కూతురును కూడా డ్రైవింగ్ లో చూడడం కొందరికి ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఒకవైపు తల్లిగా ఆలనా పాలనా చూస్తూనే మరోవైపు తనతో పాటుగా వృత్తిలో భాగం పంచడం పై కొందరికి ఆసక్తి రేపింది. దీంతో రాహుల్ అనే వ్యక్తి వారితో సెల్ఫీ దిగి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. డ్రైవింగ్ మృతిలో మహిళల పాత్ర పరిమితంగానే ఉంటుంది. అలాగే సామాజిక అడ్డంకులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా తన జీవిత లక్ష్యం కోసం నందిని చేసే సాహసంపై అందరూ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా కుటుంబాన్ని కూడా సంరక్షిస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ పోస్ట్ తర్వాత ఉబర్ ఇండియా కంపెనీ ఆ మహిళకు ప్రత్యేకంగా సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
Made my day knowing her fighting spirit. May God bless her more power and intelligence to achieve her goal.
— Kiran CPS (@cps_kiran) November 4, 2022