Sudheer Babu and Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సక్సెస్ లను సాధించాడు. కృష్ణ తర్వాత తన కొడుకు అయిన మహేష్ బాబు సైతం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన చేసిన సినిమాలతో భారీ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక క్రమంలోనే ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుత రాజమౌళితో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ కూడా ఇస్తున్నాడు…ఇక మహేష్ బాబు తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి మహేష్ వాళ్ళ బావ అయిన సుధీర్ బాబు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు… సుధీర్ బాబు సినిమాలతో రాణిస్తున్నప్పటికి స్టార్ హీరోగా మాత్రం మారలేకపోతున్నాడు. కారణమేదైనా కూడా రేపు జటాధర అనే సినిమా రిలీజ్ ఉన్న సందర్భంలో ప్రస్తుతం ఆయన ప్రమోషన్స్ భారీ రేంజ్ లో చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
సుధీర్ బాబు కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చినప్పటికి స్టార్ హీరోలతో మాత్రం పోటీ పడలేకపోతున్నాడు. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఆయన ఎందుకని సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదు.
ఇక రీసెంట్గా సుధీర్ బాబు సైతం ఈ విషయం మీద స్పందిస్తూ నేను ఇప్పటివరకు మహేష్ బాబు సపోర్ట్ లేకుండా నా ఓన్ వేలో నేను ముందుకు వెళుతున్నాను. అందువల్లే సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాను. మహేష్ బాబు సపోర్ట్ కనక తీసుకొని ఉంటే ఇప్పుడు నా స్టార్ డమ్ వేరే రేంజ్ లో ఉండేదని ఆయన చెప్పడం విశేషం…మహేష్ బాబు సైతం సుధీర్ బాబు విషయంలో పెద్దగా రెస్పాన్సిబిలిటి ఏం తీసుకోకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది…
ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది దర్శకులను రిఫర్ చేసి సుధీర్ బాబుతో సినిమా చేయమని చెప్పవచ్చు. కానీ సుదీర్ బాబు మాత్రం ఎందుకని అలా చెప్పడం లేదు అనేదే ఇప్పుడు ఘట్టమనేని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేస్తోంది…ఇక మరికొంత మంది మాత్రం మహేష్ సుధీర్ కోసం కొంతమంది దర్శకులు రిఫర్ చేయాలని చూసిన సుధీర్ వద్దని చెప్తున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం విశేషం…