మరి నిజంగానే అలా గర్భం దాలుస్తారా? దీని వెనుకున్న అసలైన రీజన్ ఏంటి?
నాగుల చవితి లేదా పంచమి రోజున పాము పుట్టలో పాలు పోయడం వల్ల గర్భం దారుస్తారని కొంతమంది పెద్దవారు చెబుతూ ఉంటారు. దీంతో ఆధ్యాత్మికత ఎక్కువగా ఉన్న మహిళలు ఉదయమే లేచి పాము పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. అయితే కొందరు ఇలా పాము పుట్టలో పాలు పోయవద్దని.. అలా పోస్తే పాము పాలు తాగదని అంటూ ఉంటారు. కానీ పాము పుట్టపై లేదా పాము పుట్టలో పాలు పోయడం వెనుక వేరే ఆరోగ్య రహస్యం ఉంది. అందులో పాము ఉంటుందో లేదో తెలియదు గాని.. పాము పుట్టపై పాలు పోయడం వల్ల ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది.
పాము గర్భిణిగా ఉన్నప్పుడు తేజస్సు, రజస్సు అనే శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి పాము పుట్టకు అంటుకొని ఉంటుంది. ఇలా అంటుకొని ఉండడం ఉన్న సమయంలో పాలు పోయడం వల్ల ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ గ్యాస్ ను మహిళలు పీల్చుకోవడం వల్ల వారిలో హార్మోన్లు సమతుల్యంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా పాము పుట్టలో పాలు పోసిన తర్వాత ఏర్పడిన గ్యాస్ పాము పుట్ట మొత్తం ప్రవహించి ఉంటుంది. ఇదే సమయంలో చాలామంది పాము పుట్టకు సంబంధించిన మట్టిని నుదుట లేదా కడుపుకు రాసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా శరీరంలోని హార్మోన్లు సక్రమంగా మారుతాయని అంటారు. పూర్వకాలంలో దీనిని గ్రహించి ఈ రెండు రోజులు పాముకు లేదా పాము పుట్టలో పాలు పోయాలని నిర్ణయించారు. అందుకే కొందరు పెద్దలు ఎవరు ఏమి చెప్పినా పాము పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. అంతేకాకుండా కొందరు భక్తితో పాము పుట్టలో పాలు పోయడం వల్ల తొందర్లోనే వారు శుభవార్తను వింటారు. దీనిని కేవలం మూఢనమ్మకం గానే కాకుండా సైంటిఫిక్ గా భావించి పాము పుట్టలో పాలు పోయవచ్చని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు.