Konda Surekha apologises: ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మధ్య గొడవలు అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, దుద్దిల్ల శ్రీధర్ బాబు మధ్య ఇటీవల విభేదాలు చోటుచేసుకున్నాయి. ఒకరద్దరు మంత్రులు అయితే బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. చివరికి క్షమాపణలతో ఆ అంకం ముగిసిపోయింది. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. మేడారం అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది.
కొండా సురేఖ ఓ ఎస్ డి సుమంత్ ను అరెస్ట్ చేయడానికి ఏకంగా తెలంగాణ పోలీసులు ఆమె ఇంటికి వెళ్తే.. సురేఖ కుమార్తె సుస్మిత అడ్డగించారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్, ఇతర మంత్రులపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒకానొక దశలో ఓ సిమెంట్ కంపెనీ వ్యవహారంలోనే ఇదంతా జరిగిందని.. సుమంత్ ను ఎలా అదుపులోకి తీసుకుంటారని సుస్మిత ప్రశ్నించింది. మంత్రుల మధ్య విభేదాలు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి ఆయుధంగా మారాయి. దీంతో తమ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా భారత రాష్ట్ర సమితి విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేసింది. దీనివల్ల అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర వాతావరణ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. పరిస్థితిని సద్దుమణిగించారు.
ఇప్పుడిక కొండా సురేఖ నేరుగా రంగంలోకి వచ్చి.. ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పారు. అంతేకాదు కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సర్వసాధారణమని.. దానిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని సురేఖ వివరించారు. ఈ పరిణామాన్ని గులాబీ పార్టీ మరో విధంగా ప్రచారం చేస్తోంది. బీసీ మంత్రితో రేవంత్ క్షమాపణ చెప్పించుకున్నారని.. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెబుతున్న ముఖ్యమంత్రి.. చివరికి ఆ సామాజిక వర్గంతోనే తనకు క్షమాపణ చెప్పించుకుంటున్నారని ఉల్టా ప్రచారాన్ని మొదలుపెట్టింది. కేటీఆర్ పై చేసిన ఆరోపణలపై కొండా సురేఖను ఒక విధంగా విమర్శించిన ఆ పార్టీ.. ఇప్పుడు రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పగానే మరో విధంగా మాట్లాడుతోంది. ఏది ఏమైనప్పటికీ మంత్రుల మధ్య విభేదాలను గులాబీ పార్టీ తనకు అనుకూలంగా మలచుకుంటున్నది.
Minister Konda Surekha apologised, saying her daughter’s remarks against the Chief Minister were made in anger after seeing the police presence.
KTR shud first take care and start loving his sister, she said pic.twitter.com/7BTTC3dLWq
— Naveena (@TheNaveena) October 23, 2025