Educated vs Uneducated Success: నేటి కాలంలో చదువుకోడానికి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు చదువుకోడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. దీంతో చాలామంది చదువుకు దూరమయ్యారు. అయితే అప్పుడు చదువుకొని ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. దీంతో ఇప్పటి తల్లిదండ్రులు చాలామంది చదువుతూనే భవిష్యత్.. చదువు ఉంటేనే జీవితమంటూ చెబుతూ ఉంటారు. కానీ ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్న స్నేహితుల్లో ఒకరు బాగా చదివిన వారు సాధారణ ఉద్యోగం చేస్తే.. మరొకరు తక్కువ చదివిన వారు కోట్ల రూపాయలు సంపాదించి తొందరగా ఎదుగుతున్నారు. మరి చదువుతోనే జీవితం అని ఎందుకు అంటున్నారు? చదువుకొని వారు ఎందుకంత డబ్బు సంపాదిస్తున్నారు?
చాలామంది చదువు అనగానే పుస్తకాలు, పేపర్లు పట్టి కుస్తీలు పడతారు. ఫస్ట్ ర్యాంకుతో ముందుంటారు. కానీ ఉద్యోగం చేసేసరికి వారి ప్రతిభ నశించిపోతుంది. అంతేకాకుండా వారితో పోటీ పడలేక.. సాధారణంగా చదివిన వారు ఎక్కువగా డబ్బు సంపాదించి బాగా చదువుకున్న వారి కంటే మంచి పొజిషన్లో ఉంటారు. అందుకు కారణం.. చదువుతోపాటు ప్రత్యేకంగా కొన్ని స్కిల్స్ ఉండడమే. అంటే కేవలం చదువు మాత్రమే ఉన్నత స్థితిలో ఉంచదు. చదువుతోపాటు అదనంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక ప్రతిభలో ఉండడం వల్ల మంచి పొజిషన్లో ఉంటారు. ప్రస్తుత కంపెనీలు చాలావరకు కేవలం ర్యాంకులు సాధించిన వారు, డిగ్రీలు సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. చదువుతోపాటు తమ కంపెనీకి అవసరమయ్యే ఎలాంటి ప్రతిభ ఉందనేది చూస్తుంది. అంతేకాకుండా చదువు తక్కువగా ఉన్నా.. వారిలో సరైన స్కిల్స్ ఉంటే కచ్చితంగా వారిని కంపెనీలు తీసుకునే అవకాశం ఉంది.
అందువల్ల ప్రస్తుత కాలంలో ఎవరైనా కేవలం చదువు మాత్రమే కాకుండా అదనపు విషయాల్లో కూడా పరిజ్ఞానం ఉండే ప్రయత్నం చేయాలి. అంటే స్కూల్లో ర్యాంకులు సాధించడానికి పుస్తకాలు కుస్తీ పట్టణం కాకుండా.. సమాజం ఎలా ఉంది? సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం చేస్తే ఒక కంపెనీకి ఉపయోగకరంగా ఉండగలుగుతావు? ఎలాంటి సమయంలో ఎలాంటి పని చేయాలి అన్న ఆలోచన ఉంటే కచ్చితంగా మిగతా వారి కంటే ఉన్నత స్థితిలో ఉండగలుగుతారు. అయితే చాలామంది కేవలం పుస్తకాలు చదవడం ద్వారా ఉన్నత స్థితిలో ఉండాలని అనుకుంటారు. చదువు బాగా చదివిన వారు కూడా ఉద్యోగాలు చేస్తారు. కానీ ఒక డ్రీమ్ సాధించాలంటే మాత్రం కేవలం చదువు ఉంటే సరిపోదు. చదువు తక్కువగా ఉన్న బయట విషయాల్లో ఎక్కువగా పరిజ్ఞానం ఉండడం వల్ల తొందరగా ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు.
ప్రస్తుత కాలంలో సాధారణ నాలెడ్జ్ కంటే ఏఐ నాలెడ్జి ఎక్కువగా అవసరం పడుతోంది. ప్రతి కంపెనీ ఏఐ స్కిల్స్ ఉన్నవారికి అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అందువల్ల ఏఐ నాలెడ్జి ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేటి కాలం యువత సైతం కేవలం చదువు అని కాకుండా సమాజంలో జరిగే పరిస్థితులను ముందే అంచనా వేసి.. సమస్యలను ఎలా పరిష్కరించాలి? అన్న విషయంపై బాగా స్టడీ చేయాలని కొందరు నిపుణులు తెలుపుతున్నారు.