Morning : ప్రతి మనిషికి ఉదయం చాలా అవసరం. ఈ ఉదయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే మీ రోజు అంత సరదాగా, ఆనందంగా ఉంటుంది. చాలా మంది ఉదయాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు. దీని వల్ల రోజు మొత్తం చాలా సూపర్ గా ఉంటుంది. అయితే మీరు రోజు చేసే కొన్ని అలవాట్ల వల్ల మీ డే ఇబ్బందికరంగా మారుతుంది. ఇతంకీ ఎలాంటి పనులు చేయకూడదో తెలుసా?
ప్రస్తుతం చాలా మంది రాత్రి ఆలస్యంగా పడుకుంటున్నారు. ఉదయమే నిద్ర లేస్తున్నారు. కొందరు చాలా ఆలస్యంగా కూడా నిద్ర లేస్తారు. ఇలా చేయడం అసలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. త్వరగా నిద్ర లేస్తే రోజంతా పనిచేయడానికి మీకు ఎక్కువ సమయం లభిస్తుంది. ఇక ఈ సమయంలో వ్యాయామం, ధ్యానం లేదా ఏదైనా ఇతర పనులు చేసుకోవచ్చు. అందుకే కాస్త నిద్ర సమయాన్ని తగ్గించాలి. ప్రతి కొన్ని రోజులకు 15-30 నిమిషాల ముందు నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. దీని వల్ల మీకు త్వరగా నిద్ర లేచే అలవాటు అవుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ముఖ్యం. దీనివల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. రోజూ 30 నిమిషాల పాటు నడవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. కేవలం నడక వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వాకింగ్ కుదరకపోతే ఇంట్లో చిన్నపాటి వ్యాయామాలు, యోగా చేయడం అలవాటు చేసుకోండి. మీకు నచ్చిన ఏదైనా వ్యాయామం చేసినా ఒకే. యోగా కోసం యోగా సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. యూట్యూబ్ లో చేస్తూ గైడ్ ను ఫాలో అయితే సరిపోతుంది.
కొందరు ఉదయం లేవగానే బెడ్ కాఫీ లేదా టీ తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇవి తాగితే అసిడిటీ సమస్య వస్తుంది. ఇక కొందరు లేవగానే ఫోన్ చూస్తారు. దీని కోసం సమయం వృధా అవుతుంది. సోషల్ మీడియలోకి ఎంటర్ అయితే బయట పడటం చాలా కష్టం. అందుకే కాస్త సోషల్ మీడియాకు ఉదయం దూరంగా ఉండాలి. కాసేపు వార్మప్ చేసుకోవాలి. దీని వల్ల నిద్ర మత్తు మొత్తం వదులుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా అవసరం. అందుకే ఉదయాన్నే నిద్రలేవగానే ధ్యానానికి కొంత సమయం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
రాత్రి నిద్రపోతారు ఉదయం లేస్తారు. సో ఎక్కువగా నీరు తాగరు కాబట్టి శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత నీరు తాగాలి. దీని వల్ల మీకు మంచి జరుగుతుంది. రోజూ ఉదయాన్నే నీరు తాగాలి. శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే ఉదయం నిద్ర లేచిన తర్వాత చల్ల నీరు కంటే కాస్త గోరువెచ్చని నీరు తాగడం మరింత మంచిది. ఉదయాన్నే అల్పహారం తీసుకుంటే చాలా మంచిది. దీని వల్ల శక్తి వస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది ఈ అలవాటు.