https://oktelugu.com/

Read : ఎంత చదివినా గుర్తు ఉండటం లేదా?

కొందరు పిల్లలు పుస్తకాల పురుగులుగా ఉంటారు. ఎప్పుడు చూసినా సరే పుస్తకాల పురుగులుగా ఉంటాయి. కానీ ఎంత చదివినా సరే కొందరు మాత్రం త్వరగా మర్చిపోతారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 2, 2024 / 12:12 PM IST

    Read

    Follow us on

    Read : కొందరు పిల్లలు పుస్తకాల పురుగులుగా ఉంటారు. ఎప్పుడు చూసినా సరే పుస్తకాల పురుగులుగా ఉంటాయి. కానీ ఎంత చదివినా సరే కొందరు మాత్రం త్వరగా మర్చిపోతారు. ఇక పరీక్షలు దగ్గర పడుుతంటే మానసిక ఆందోళన, ఒత్తిడి పెరిగుతుంది. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని పాటించి మీ మందబుద్దిని, మతిమరుపును తరిమికొట్టండి.

    ప్రశాంత వాతావరణం: చదువుకునే ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి డిస్ట్రబ్ ఉండకూడదు. మీ ప్రాంతం ఇలా ఉంటే చదువు మీదనే మీ దృష్టి ఉంటుంది. చదివింది బాగా గుర్తుండాలంటే ఏకాగ్రత ముఖ్యం కాబట్టి ఏకాగ్రత నిలవడానికి ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

    బట్టీ వద్దు.. బట్టి పట్టడం చాలా మందికి అలవాటు. కానీ అలా బట్టి పట్టవద్దు. అర్థం చేసుకొని చదవాలి. మీరు చదివే సబ్జెక్టు అర్థం చేసుకునే ప్రయత్నం వల్ల అందులోని చాలా అంశాలు మీకు గుర్తుండిపోతాయి. అర్థంచేసుకుంటూ చదివితే ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది. సమాచారం మొత్తం ఒకేసారి చదివి గుర్తుపెట్టుకోవాలి అనుకోవడం తప్పు. వ్యాసాన్ని చిన్నచిన్న భాగాలుగా మార్చుకుంటూ చదవాలి.

    సంక్షిప్త నామాలుగా విభజిస్తే మరిచిపోరు: మీ వద్ద ఉన్న సమాచారాన్ని చిన్న చిన్న పదాలు, వాక్యాలుగా మార్చుకోవాలి. ఇదొక మంచి టెక్నిక్‌. పదాల్లోని తొలి అక్షరాన్ని గుర్తు పె ట్టుకుంటే కూడా మిగిలిన మొత్తం పదం, ఆ తర్వాత సంబంధిత వాక్యాన్ని గుర్తు పెట్టుకోవడం కూడా సులభం అవుతుంది.

    రూపం: ప్రముఖుల పేర్లను గుర్తుంచుకునే ముందే వారి రూపాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దు. దీని వల్ల వ్యక్తి పేరు కూడా మీకు ఫాస్ట్ గా గుర్తు వస్తుంది.

    నోట్సు రాయడం: ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలతో నోట్సు రాయండి. పరీక్షల ముందు వీటిని ఒకసారి చదువితే చాలా అంశాలు గుర్తుంటాయి. చదివిన వాటిని ఎప్పటికప్పుడు చూడకుండా రాయాలి. ఈ అలవాటు వల్ల మీరు చదివిన విషయం ఎంతవరకు గుర్తుందో తెలుస్తుంది. సగం మాత్రమే గుర్తుంటే మిగతా సగాన్ని మళ్లీ చదవచ్చు. గుర్తు పెట్టుకోవచ్చు.

    ‘అంతర్‌ సూత్రం’: కొన్ని పేర్లను వాటి వెనుక ఉండే అంతర్‌సూత్రం తో చదివితే ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. అంటే రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్‌ క్రమంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాచేస్తే మధ్యలో ఏ ఒక్క రాష్ట్రం పేరునూ మర్చిపోయే అవకాశం ఉండదు అంటున్నారు నిపుణులు. ఇక గ్రహాల పేర్లను వాటి పరిమాణం ఆధారంగా గుర్తు పెట్టుకోవాలి.

    చదివే ప్రదేశం: ఎప్పుడూ ఒకేచోట కూర్చుని చదవవద్దు. దీని వల్ల ఒక్కోసారి విసుగ్గా అనిపిస్తుంది. చదివే ప్రదేశాన్ని అప్పుడప్పుడూ మార్చడం వల్ల మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటలు, టీవీ, స్మార్ట్‌ఫోన్‌ వల్ల చదువు మీద ఏకాగ్రత దెబ్బతింటుంది. గాలి, వెలుతురు ధారాళంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవడం వల్ల మీరు మరింత ఎక్కువగా చదువుతారు. చిరాకు, బోరింగ్ అనిపిస్తే కాస్త పరిసరాలను ఎంజాయ్ చేసి మళ్లీ పుస్తకపఠనంలో బిజీ అవ్వాలి. చదువును ఎంజాయ్ చేయాలి.