Moral Value Message: ఈ భూమ్మీద ఉన్న మనుషుల్లో ఒకరి మనస్తత్వానికి మరో మనసు పోలిక ఉండదు. ఎవరికి వారే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అలా కొందరు మంచివారు ఉండొచ్చు..చెడ్డవారు ఉండొచ్చ.. ఎవరు ఎలా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో వారితో కలిసి ప్రయాణం చేయక తప్పదు. కానీ మరీ ఇబ్బంది పెట్టేవారి నుంచి దూరంగా ఉండడమే మంచిది. చెడ్డవారికి దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా.. సాధ్యం కాకపోతే.. వారు మన మాట వినేవారు అయితే వారి మనస్తత్వాన్ని మార్చాల్సి ఉంటుంది. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఈ పండ్లవ్యాపారి కథ వింటే అసలు విషయం అర్థం అవుతుంది. మరి ఆ కథేంటో తెలుసుకోవాలని ఉందా?
Also Read: Ashwini Sree Turns Up The Heat: గోవాలో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
ఒక వ్యాపారి మెయిన్ రోడ్డు పక్కన పండ్లను విక్రయిస్తూ ఉంటాడు. తన వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొందరు పదే పదే ఇక్కడే పండ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకు కారణం ఆయన నాణ్యమైన పండ్లను మాత్రమే విక్రయిస్తాడు. ఫ్రెష్ ఉండే పండ్లను అందుబాటులో ఉంచడంతో పాటు ఎలాంటి కీటకాలు పడకుండా జాగ్రత్తపడుతాడు. అయితే పండ్లు వాతావరణానికి మారుతూ ఉంటాయి. ఒక్కోసారి వీటిలో ఏదో ఒకటి పాడై పోయే అవకాశం ఉంటుంది. అ వ్యాపారి పాడైపోయిన పండును వెంటనే తీసేస్తున్నాడు. అలా తీయడం వల్ల తనకు నష్టం ఏర్పడుతుంది. కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఎన్ని పండ్లు పాడైతే.. అన్ని తీసేస్తున్నాడు.
అయితే ఆ వ్యాపారి తనకు నష్టం వస్తందని భావించి.. ఆ పండును అలాగే ఉంచితే.. మిగతా పండ్ల పాడైపోతాయి. అలా కాకుండా అతి తెలివితో ఆ పాడైపోయిన పండును ఇతరులకు విక్రయిస్తే.. మరోసారి కొనగోలుదారులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల పాడైపోయిన పండును తీయక తప్పలేదు.
Also Read: Hardik Pandya divorce: మనసు విప్పిన హార్దిక్ విడాకుల తర్వాత మొదటి స్పందన
అలాగే మనుషుల్లో కూడా అందరూ మంచివారు ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. పది మంది మంచి మనుషులు ఉన్న గ్రూపులో ఒక్కర చెడ్డ వ్యక్తి ఉన్నా.. ఆ గ్రూపు మొత్తం పాడైపోతుంది. ఇలాంటి సమయంలో పాడైపోయిన ఆ వ్యక్తిని మార్చాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఆ వ్యక్తికి దూరంగా ఉండాల్సిన సమయమది. పండు విషయంలో వ్యాపారి ఆలోచించిన విధంగానే ఒక కుటుంబ పెద్ద కూడా తన కుటుంబంలోని అందరూ వ్యక్తులూ నాణ్యమైన వ్యక్తులుగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కుటుంబం బాగుపడుతుంది. స్నేహితుల్లోనూ ఈ విషయమే వర్తిస్తుంది. ఉన్నవారిలో ఏ ఒక్కరూ బాగా లేకపోయినా ఉన్నవారందరికీ అదే పేరు వస్తుంది. అందువల్ల స్నేహం చేసే సమయంలోనూ ఎదుటి వ్యక్తి గుణాన్ని తెలుసకొని మందుకు సాగాలి. లేకుంటే జీవితంలో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.