Money Saving Secrets: ప్రస్తుతం అన్ని బ్రాండెడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను చిన్న పెద్ద ప్యాక్‌లలో సేల్ చేస్తున్నాయి. గతంలో ఆఫ్ కేజీ, కేజీ ఆపై ప్యాక్‌లలో మాత్రమే లభించే వస్తువులు ఇప్పుడు 50, 100 గ్రాములలో సైతం లభిస్తున్నాయి. ఈ చోటా ప్యాక్‌లు వచ్చాక అనేక కంపెనీలు తమ సేల్స్ పెంచుకున్నాయి. వ్యాపారం సక్సెస్ ఫుల్‌గా సాగుతోంది. దీంతో అన్ని కంపెనీలో చిన్నప్యాకెట్‌ల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు చాలా మందికి ఒక అనుమానం కలుగుతోంది. చిన్న ప్యాకెట్ మంచిదా.. పెద్దది మంచిదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్న ప్యాకెట్‌లో ఎక్కువ లాభం..
చాలా మంది మిడిల్ క్లాస్, ఆ పై తరగతుల వారు నెలవారీ సరుకులను ఒకేసారి తెచ్చుకుంటారు. ఇక పేదలు మాత్రం తమ అవసరాల మేరకు సరుకులు తెచ్చుకుంటారు. అయితే నెలవారీ సరుకులు తెచ్చుకునేవారంతా అన్నీ వస్తువులను నెలకు సరిపడే ప్యాక్‌లలో తీసుకుంటారు. అయితే ఇలా తీసుకోవడం వలన చాలా నష్టపోతున్నారు. చిన్న ప్యాక్‌లు కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ లాభం కలుగుతుంది.
సర్ఫ్ ఎక్సెల్ డిటర్జంట్..
సర్ఫ్ ఎక్సెల్ కిలో ప్యాకెట్ ధర రూ.170. దీనిని ఓపెన్ చేసి తూకం వేస్తే 1001 గ్రాముల పౌడర్ వస్తుంది. ఇక అదే సర్ఫ్ ఎక్సెల్ రూ.10 ప్యాక్ కొనుగోలు చేస్తే రూ.170కి 17 ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్లను కూడా తూకం వేయగా 1,430 గ్రాముల పౌడర్ వచ్చింది. అంటే రూ.10 ప్యాకెట్లు కొంటే 429 గ్రాముల పౌడర్ ఎక్కువగా వచ్చింది. అంటే దాదాపు హాఫ్ కేజీ ఎక్కువ వచ్చింది. అంటే పెద్ద ప్యాక్ కన్నా.. చిన్న ప్యాక్‌తో ఎక్కువ లాభం అన్నమాట.
అన్ని బ్రాండ్లలో చోటా ప్యాకెట్స్..
ఇప్పుడు డిటర్జెంట్లే కాదు… వివిధ ప్రొడక్ట్‌లను ప్రముఖ కంపెనీలు స్మాల్ ప్లాకెట్లుగా చేసి విక్రయిస్తున్నాయి. బాడీ సోప్స్, డిటర్జంట్ సోప్స్, డిష్‌వాష్ సోప్స్‌తోపాటు అనేక ప్రొడక్టులు మార్కెట్‌లో చిన్న ప్యాక్‌లలో కూడా లభిస్తున్నాయి. బిలో మిడిల్ క్లాస్ ప్రజలను కూడా ఆకట్టుకునేందుకు కంపెనీలు ఇలా చేస్తున్నాయి. అయితే పేదలకు చోటా ప్యాక్‌లలో లాభం జరుగుతుండగా, మిడిల్ క్లాస్ వారికి మాత్రం నష్టం జరుగుతోంది.