https://oktelugu.com/

Money Plant: మనీ ప్లాంట్ కు ఈ ఒక్కటి కట్టండి చాలు.. మీ ఇంట్లో లక్ష్మి దేవి తాండవం చేస్తుంది..

మనీ ప్లాంట్ ను సవ్య దిశలో, సరైన ప్రాంతంలో ఉంచితేనే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. ఇక ఇందులో ఓ వస్తువును వేస్తే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండటం కాదు రెట్టింపు అవుతుందట.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 1, 2024 / 09:12 AM IST

    Money Plant

    Follow us on

    Money Plant: వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ చెట్టును చాలా నమ్ముతారు. దీని వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అనుకుంటారు. ఈ మొక్క శాంతిని చేకూర్చడమే కాదు ఆర్థిక ఇబ్బందులను కూడా దూరం చేస్తుందని నమ్ముతారు. కానీ దీన్ని ఇంట్లో నాటాలి అంటే నియమాలు ఉంటాయి. వాటి గురించి ఓ సారి తెలుసుకోండి. ఇంట్లో ఉంచే మొక్కలు ఇంటి అందాన్ని పెంచుతుంటాయి. ఈ మొక్కలు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతాయి. అందుకే ఈ రోజు మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందాం.

    మనీ ప్లాంట్ ను సవ్య దిశలో, సరైన ప్రాంతంలో ఉంచితేనే ఇంట్లో డబ్బుకు కొరత ఉండదు. ఇక ఇందులో ఓ వస్తువును వేస్తే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఉండటం కాదు రెట్టింపు అవుతుందట. మరి ఈ రోజు ఈ విషయాన్ని తెలుసుకుందాం. మీ ఇంట్లో మనీ ప్లాంట్ ను నాటితే ముందుగా దిశపై శ్రద్ధ వహించాలి. దీన్ని ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఇక మనీ ప్లాంట్ ను నేల మీద ఎప్పుడు కూడా నాటకూడదు. దాని ఆకులు నేల వైపు పెరుగుతాయి.

    నేల వైపు ఆకులు పెరిగితే ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఇక మనీ ప్లాంట్ ను ఎప్పుడు కూడా శుభ్రమైన ప్రదేశంలోనే నాటాలి. దీని వల్ల ఇంట్లో మంచి శ్రేయస్సు ఉంటుంది. శుక్రవారం రోజు మనీ ప్లాంట్ పై ఎర్రటి దారం కట్టాలి. ఇలా కట్టడం వల్ల శుభ్రప్రదమట. ఎరుపు రంగు విజయం, పురోగతికి చిహ్నంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిమితులు తొలిగి పురోగతిని సాధిస్తారు. మరి ఓ సారి ట్రై చేసి చూడండి

    ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్, ప్రజల విశ్వాసాల మేరకు మాత్రమే అందించడం జరిగింది. దీన్ని ‘oktelugu.com’ నిర్దారించదు.