Summer Herbal Drinks: మండే ఎండల్లో.. శక్తి కోసం ఈ హెర్బల్ డ్రింక్స్ తాగాల్సిందే

అల్లం, నిమ్మరసం తో కోల్పోయిన లవణాలను తిరిగి పొందొచ్చు. అల్లం ఆయుర్వేద పరంగా జీర్ణ ప్రక్రియకు సహకరిస్తుంది. వేసవికాలంలో వాంతులు, విరోచనాలను తగ్గిస్తుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 1, 2024 9:03 am

Summer Herbal Drinks

Follow us on

Summer Herbal Drinks: వేసవి లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో మన శరీరం వెంటనే నిస్సత్తువకు గురవుతుంది. కోల్పోయిన లవణాలు తిరిగి చేర్చకపోతే మరింత నీరసానికి లోనవుతుంది.. అలాంటప్పుడు మన దేహాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. వేసవి లో ఎలాంటి డ్రింక్స్ తాగితే శరీరం సత్వర శక్తి పొందుతుందో ఈ కథనం లో తెలుసుకుందాం.

లెమన్ జ్యూస్/ నిమ్మరసం

లెమన్ జ్యూస్ అనేది శరీరానికి సత్వర శక్తి లభించేలా చేస్తుంది. దేహాన్ని ఆల్క లైజ్ చేయడం నిమ్మ రసం ప్రత్యేకత. దీనిలో “విటమిన్ సీ” ఉంటుంది. జీర్ణ క్రియను పెంపొందించడం లో తోడ్పడుతుంది. ఎండా కాలంలో ఏమాత్రం నిస్సత్తువగా అనిపించినా, నిమ్మరసం తాగడం శరీరానికి మంచిది. నిమ్మరసం లో కొంత మంది చక్కెర వేసుకుంటారు. మరి కొంత మంది తేనె కలుపుకుంటారు. ఇంకా సబ్జా గింజలు వేసుకుని లాగించేస్తారు. నిమ్మరసాన్ని ఎలా తాగినా సత్వరం శక్తి లభిస్తుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

పుదీనా టీ

పుదీనా ఆకు అనేక పోషకాల సమ్మేళితం. అజీర్ణం నుంచి తొందరగా ఉపశమనం లభించేందుకు పుదీనా తోడ్పడుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. శ్వాసలో తాజాదనాన్ని పెంపొందించేందుకు సహకరిస్తుంది. పుదినా ఆకులను వేడి నీటిలో కొన్ని నిమిషాల పాటు ఉంచి, అందులో ఉప్పు, శొంఠి వేసుకొని తాగితే ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి సత్వరమైన శక్తి లభిస్తుంది.

కొబ్బరి నీళ్లు

కొబ్బరినీళ్లు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇందులో అనేక రకాలైన మినరల్స్ ఉంటాయి. కొబ్బరినీళ్లను తాగితే శరీరానికి సత్వర శక్తి లభిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉన్న విటమిన్లు శరీర వృద్ధికి సహకరిస్తాయి. లేత కొబ్బరి జీర్ణ వృద్ధికి ఉపకరిస్తుంది.

అల్లం, నిమ్మరసం

అల్లం, నిమ్మరసం తో కోల్పోయిన లవణాలను తిరిగి పొందొచ్చు. అల్లం ఆయుర్వేద పరంగా జీర్ణ ప్రక్రియకు సహకరిస్తుంది. వేసవికాలంలో వాంతులు, విరోచనాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియకు అత్యద్భుతంగా సాయపడుతుంది. వివిధ ఎంజైమ్ ల పనితీరును మెరుగుపరుస్తుంది.. చిన్న చిన్న ముక్కలుగా చేసిన అల్లాన్ని, నిమ్మరసం, తేనె, ఐస్ ముక్కలతో కలిపి తీసుకుంటే శరీరానికి సత్వర శక్తి లభిస్తుంది.

పుచ్చకాయ రసం

పుచ్చకాయల్లో 100% నీరే ఉంటుంది. పుచ్చకాయలను ముక్కలుగా తినొచ్చు. రసం చేసుకుని తాగొచ్చు. శరీరం నిస్సత్తువకు గురైనప్పుడు దీనిని తాగితే సత్వరమైన శక్తి లభిస్తుంది.. ఇందులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. లైకోపిన్ సూర్య రశ్మి నుంచి కాపాడుతుంది. దీని రసంలో కాస్త అల్లం ముక్కలను యాడ్ చేసుకుంటే శరీరానికి మరింత చలవ చేస్తుంది.

కలబంద రసం

కలబందను ఇంగ్లీషులో అలోవెరా అని పిలుస్తారు. ఇది కడుపులో ఉన్న మంటను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. చర్మానికి సరికొత్త చాయను తీసుకొస్తుంది. ఇది రుచికి చేదుగా ఉంటుంది కాబట్టి.. దీని రసంలో పండ్ల ముక్కలు లేదా పండ్ల రసాలను కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.

గ్రీన్ టీ

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియను పెంపొందిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వేడివేడి నీళ్లలో “గ్రీన్ టీ ” బ్యాగులను కొద్దిసేపు ఉంచిన తర్వాత తీసుకుంటే సత్వర ప్రయోజనం లభిస్తుంది. వేడిగా వద్దనుకుంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి కూడా తాగొచ్చు.