Salt
Salt :మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. అయితే ఏ పదార్థంలోనైనా తప్పనిసరిగా వాడేది ఉప్పు. ఉప్పు లేకుండా ఏ పదార్థం రుచిగా ఉండదు. ఉప్పులేని ఇల్లు కనిపించదు. అయితే ఉప్పును కేవలం ఆహార పదార్ధంగా మాత్రమే కాకుండా లక్ష్మీదేవిగా భావిస్తే ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉంటుంది. ఉప్పు వల్ల ఎన్నో శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉప్పును కొన్ని రకాలుగా ఉపయోగించడం వల్ల అనేక అనర్ధాలు కూడా జరుగుతాయి. అందువల్ల ఇంట్లో ఉన్న ఉప్పును సక్రమమైన మార్గంలో ఉంచి దానిని మంచి పనులకు ఉపయోగించాలని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో ధనం నిలవాలంటే ఉప్పుతో కొన్ని పనులు చేయాలని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఇంట్లో ధనం నిలవాలంటే ఉప్పుతో ఏం చేయాలి?
నేటి కాలంలో డబ్బు కోసం చాలామంది ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. కానీ అనేక ఖర్చుల ద్వారా డబ్బు ఇంట్లో నిల్వ ఉండడం లేదు. కొందరికి ఖర్చులు లేకున్నా కూడా డబ్బు ఇంట్లో నిలవకుండా ఉంటుంది. అందుకు కారణం ఇంట్లో ఉండే కొన్ని నెగెటివ్ ఎనర్జీ లేనని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఈ నెగటివ్ ఎనర్జీ పోవాలంటే కొన్ని రకాల పనులు చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఉప్పుతో కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుందని పేర్కొంటున్నారు.
Also Read : వామ్మో ఈ ఉప్పు ధర ఇంతా? ప్రపంచంలోనే ఖరీదైనది ఇదే
ఇంట్లో ఉండే మిగతా పదార్థాల్లో కంటే ఉప్పు చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఒప్పు లక్ష్మీదేవితో సమానం. ఉప్పును సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి. ఉప్పును ఎప్పుడూ ఇంట్లో దక్షిణ దిశలో ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు నిలువ ఉండదు. ఇంట్లో డబ్బు నిలువ ఉండాలంటే ఉప్పును తూర్పు దిశలో ఉంచుకోవాలి. ఇలా ఉంచడం వల్ల డబ్బు నిలువ ఉండడమే కాకుండా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే ఇల్లు శుభ్రం చేసినప్పుడల్లా ఉప్పుతో చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఇంట్లోనే క్రిములు నాశనం అవుతాయి.
అయితే ఉప్పుతో మరికొన్ని పనులు కూడా చేయవచ్చు. ఒక ఎర్రటి బట్టలు ఉప్పును చుట్టి దానిని కిచెన్లో ఎవరికీ కనిపించకుండా దాచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనం ఎప్పటికీ నిలువగా ఉంటుంది అని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అలాగే ఇంట్లో ఉన్న ఒప్పును సాయంత్రం ఎవరికి ఇవ్వరాదు. ఇంట్లో ఎప్పటికీ గొడవలు ఉన్నట్లు గమనిస్తే ఉప్పును కొద్దిగా ఆవాలతో కలిపి ఇంటి చుట్టూ వేస్తే దిష్టి పోతుంది. దీంతో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు.
ఇలా ఉప్పును సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవడం వల్ల ఇంట్లో ధన ప్రాప్తి పెరుగుతుంది. అలాగే ఇంట్లో వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం నుండి ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయితే సన్నపు ఉప్పు కంటే దొడ్డు ఉప్పుతోనే ఈ పనులు చేయడం మంచిది అని కొందరు పండితులు చెబుతున్నారు.
Also Read : అన్ని పదార్థాలకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు.. ఉప్పుకు ఉంటుందా?