Happiness
Happiness: సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందరు అనుకుంటారు. కానీ చాలా రీజన్స్ సంతోషంగా ఉండనివ్వవు. అయితే, ఇది సాధ్యం కాదు. జీవితంలో కొన్నిసార్లు ఆనందం వస్తుంది. కొన్నిసార్లు విచారం వస్తుంది. ఎవరి లైఫ్ లో అయినా సరే ఇది కామన్ గా జరుగుతుంది కదా. వాటిని అంగీకరించాలి కూడా. అయితే చాలా సార్లు మీ ఆనందాన్ని మీరే వద్దు తరిమి కొడుతున్నారు అని మీకు తెలుసా? అవును, మీకు కొన్ని అలవాట్లు (సెల్ఫ్-సబోటేజింగ్ హ్యాబిట్స్) అవి మీ ఆనందానికి శత్రువులుగా మారతున్నాయి అంటున్నారు నిపుణులు. మరి మీ ఆనందాన్ని దూరం చేసే ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం: తరచుగా ఇతరుల జీవితాలతో మనల్ని మనం పోల్చుకోవడం ప్రారంభిస్తే చాలా సమస్యలు వస్తాయి. డబ్బు అయినా, సంబంధాలు అయినా, కెరీర్ అయినా లేదా అందం అయినా, ఇతరులు మనకంటే గొప్పవారని అనుకుంటాము. ఈ అలవాటు మన ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. అసంతృప్తి వైపు నెట్టివేస్తుంది. గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. పోలిక ప్రతికూలతను మాత్రమే అర్థం అయ్యేలా చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ లో బాధలు ఉంటాయి.
గతాన్ని పట్టుకుని ఉండటం: చాలా మంది తమ గతంలో జరిగిన బాధలు, తప్పులు లేదా నిరాశలను పట్టుకొని వదలరు. వాటి గురించే ఆలోచిస్తూ బాధ పడుతుంటారు. వారు ఆ విషయాలను మరచిపోరు. వాటినే గుర్తు చేసుకుంటూ ప్రెజెంట్ ను ఇబ్బందికరంగా మార్చుకుంటారు. గతాన్ని వదిలి ముందుకు సాగడం వల్ల సంతోషంగా ఉండవచ్చు. గడిచిపోయిన దానిని మార్చలేము. కానీ మీరు మీ ప్రజెంట్ ను మార్చుకోవడం వల్ల రేపటిని మెరుగుపరుచుకోవచ్చు.
ప్రతికూల ఆలోచన: ప్రతికూల ఆలోచనలు మనస్సును లోపలి నుంచి ఖాళీ చేస్తాయి. కొందరు ప్రతిదానిలోనూ తప్పులు వెతకుతుంటారు. ఇలాంటి అలవాటు వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ అలవాటు ఒత్తిడి, ఆందోళనకు దారి తీస్తుంది. సానుకూల ఆలోచనను అలవర్చుకోవడం ద్వారా జీవితంలోని చిన్న క్షణాలను ఆస్వాదించవచ్చు. ఆనందించవచ్చు. సంతోషించవచ్చు.
ఇతరుల అభిప్రాయాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం: చాలా సార్లు ఇతరుల అభిప్రాయాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారంటే వారి స్వంత ఆనందాన్ని మరచిపోతారు ప్రజలు వారి గురించి ఏమి అనుకుంటున్నారో లేదా ఆలోచిస్తారో చాలా మంది తెగ ఆందోళన చెందుతారు. ఈ అలవాటు మీ కలలు, కోరికల నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం ముఖ్యం. కానీ మీ ఆనందం పాడు చేసేంత కాదు.
అధిక అంచనాలు: ఇతరుల నుంచి లేదా మన నుంచి చాలా ఎక్కువ అంచనాలను కలిగి ఉండాలి. ఎక్సె పెక్టేషన్స్ వల్ల నిరాశనే మిగులుతుంది. ప్రతి ఒక్కరికీ పరిమితులు ఉంటాయి. ప్రతిదీ మనం కోరుకున్న విధంగా జరగకపోవచ్చు. అంచనాలను తగ్గించడం ద్వారా జీవితాన్ని సులభతరం, సంతోషంగా మార్చుకోవచ్చు.
మీకు మీరే సమయం ఇవ్వకపోవడం: నేటి బిజీ జీవితంలో సమయం కేటాయించడం మర్చిపోతున్నారు. చాలా బిజీగా మారిపోతున్నారు. మీ కోసం మీరు సమయం కేటాయించుకోవడం, మీకు నచ్చిన పనులు చేయడం మర్చిపోతున్నారా? మీతో సమయం గడపడం, మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి. ఇది మనల్ని మానసికంగా, భావోద్వేగపరంగా బలంగా చేస్తుంది.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.