Mistakes when applying oil: జుట్టు బలంగా, పొడవుగా ఉండాలంటే కచ్చితంగా నూనె రాయాలి అంటారు అమ్మమ్మలు. ఇది నిజం కదా. కానీ జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. మెరుస్తుంది. పొడవుగా ఉంటుంది. అయితే జుట్టుకు నూనె రాయడం ఎంత ముఖ్యమో? జాగ్రత్తగా నూనె రాయడం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా ప్రజలు జుట్టుకు నూనె రాసుకునేటప్పుడు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల జుట్టుకు ప్రయోజనం చేకూరే బదులు హాని కలుగుతుంది. అందుకే జుట్టుకు నూనె రాసుకునేటప్పుడు నివారించాల్సిన కొన్ని తప్పుల గురించి తెలుసుకుంటే మీరు కూడా ఈ మిస్టక్స్ చేయరు. మరి అవేంటంటే?
Also Read: మహేష్ బాబు కూతురుకి డ్యాన్స్ నేర్పిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా..? ఫ్యాన్స్ కలలో కూడా ఊహించి ఉండరు!
కొంతమంది ఎంత ఎక్కువ నూనె రాసుకుంటే జుట్టు అంత ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటారు. కానీ తప్పు. ఎక్కువ నూనె రాసుకోవడం వల్ల తలలోని రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. ఇలా చేస్తే జుట్టు రాలుతుంది. అందుకే అవసరమైనంత మాత్రమే నూనె రాసి, తలకు బాగా మసాజ్ చేయండి.
చాలా మంది పడుకునే ముందు నూనె రాసి రాత్రంతా అలాగే ఉంచుతారు. కానీ ఎక్కువసేపు నూనెను తలపై ఉంచడం వల్ల నెత్తిమీద బ్యాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ లేదా చుండ్రు వస్తుంది. అందువల్ల, 1-2 గంటల కంటే ఎక్కువసేపు నూనెను తలపై ఉంచవద్దు. మీరు రాత్రిపూట నూనె రాసుకుంటే, ఉదయాన్నే మీ జుట్టును కడగాలి.
Also Read: అనసూయను ఏమంటే కాలుద్దో అదే అన్న రోజా… వేదిక ఫైర్ బ్రాండ్స్ రచ్చ!
జుట్టు చివరలకు
చాలా మంది తలకు మాత్రమే నూనె రాసుకుంటారు. కానీ జుట్టు చివరలను మర్చిపోతారు. జుట్టు చివరలు ఎక్కువగా పొడిగా ఉంటాయి. చిట్లుతాయి కూడా. కాబట్టి వాటికి నూనె ఎక్కువగా అవసరం. కాబట్టి నూనె రాసేటప్పుడు, జుట్టు చివరలకు కూడా తేలికపాటి నూనె రాయండి. జుట్టు చాలా పొడిగా ఉంటే, కొబ్బరి నూనె లేదా ఆర్గాన్ నూనెను ఉపయోగించండి.
చుండ్రు ఉంటే
మీ తలపై చుండ్రు ఉంటే, నూనె రాయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. నూనె చుండ్రును ప్రోత్సహిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. కాబట్టి ముందుగా చుండ్రుకు పోగొట్టే ప్రయత్నం చేసి, తర్వాత నూనె రాయండి. అలాగే, యాంటీ-డాండ్రఫ్ షాంపూ లేదా వేప నూనెను ఉపయోగించండి.
మీ తలపై మొటిమలు ఉంటే, నూనె రాయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. నూనె చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. ఇది మొటిమలు, చికాకును కలిగిస్తుంది. కాబట్టి మీ తలపై మొటిమలు ఉంటే, నూనె రాయడం మానుకోండి. మీకు కావాలంటే, మీరు జోజోబా ఆయిల్ వంటి తేలికపాటి, నాన్-కామెడోజెనిక్ నూనెను ఉపయోగించవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.