Rajyog For 5 Zodiacs: గ్రహాల కదలికలను బట్టి మన జాతకాలు మారుతుంటాయి. శుక్ర మహాదశ ఉన్నట్లయితే మనకు అన్ని శుభాలు కలుగుతాయని చెబుతారు. గురు అనుగ్రహం ఉంటే మనకు తిరుగే ఉండదు. మొత్తానికి గ్రహాల అనుకూలత లేకపోతే ఎవరికైనా ఇబ్బందులే వస్తాయి. దీంతో మన బతుకు అగమ్యగోచరంగా మారుతుందనడంలో సందేహం లేదు. మనకు గ్రహాలు అనుకూలంగా ఉంటే ఏదైనా పట్టిందల్లా బంగారమే అవుతుంది. గ్రహాలు మన రాశికి అనుకూలంగా ఉన్నట్లయితే మట్టి పట్టుకున్నా బంగారం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే గ్రహబలం లేకపోతే ఏదైనా మనకు సాధ్యం కాదని తెలుస్తోంది. గ్రహాల కదలికలో మార్పును ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.

సెప్టెంబర్ 24న గ్రహాల స్థితి అద్భుతంగా ఉండనుంది. దీంతో ఐదు రాశుల వారికి ఎంతో మేలు జరగనుంది. ఐదు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడనున్నాయి. ఈ అద్భుతమైన రోజు 59 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ రోజు శని, బుధుడు, బృహస్పతి తిరోగమనంలో ఉంటారు. సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగం, శుక్ర సంచారం క్షీణించిన రాజయోగాన్ని కలిగిస్తారు. దీంతో పాటు భద్ర, హంస రాజయోగాలు పట్టనున్నాయి. ఈ ఐదు రాశుల వారికి శుభం జరగుతుంది. ఈ ఐదు రాశుల వారు అపారమైన సంపదలు పొందుతారని చెబుతున్నారు.
ఈ రోజు వృషభ రాశి వారికి రాజయోగాలు రానున్నాయి. వ్యాపారాల్లో లాభాలు తెచ్చుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలలో పెట్టుబడులు పెడితే లాభాలు వరిస్తాయి. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. ఇంకా మిథున రాశి వారికి కూడా శుభ శకునాలే కనిపిస్తున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనలాభం ఉంటుంది. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. కోరుకున్న ప్రదేశానికి బదిలీలు కూడా జరుగుతాయి. అదృష్టంతో పట్టిందల్లా బంగారం కావడం ఖాయమే.

కన్యరాశి వారికి కూడా లాభాలు వరదల్లా వస్తాయి. నూతన ఉద్యోగావకాశాలున్నాయి. మీడియా, సినిమా రంగాల్లో ఉన్న వారికి ప్రయోజనాలు అందుతాయి. ఆగిన పనులు పూర్తవుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి వారికి కూడా సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు లాభిస్తాయి. ధనం సమయానికి చేతికందుతుంది. మీన రాశి వారికి కూడా ఈ రోజు ప్రతి విషయం ఎంతో బాగుంటుంది. నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది అనుకూల సమయం అని తెలుస్తోంది.
59 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ రోజును పై రాశుల వారికి అనుకూలంగా ఉండటంతో వారు సద్వినియోగం చేసుకుని బతుకు పద్ధతిని మార్చుకునేందుకు అవకాశం ఉన్నందున వీరు జీవితంలో స్థిరపడేందుకు సిద్ధం కావాలి. మంచి రోజు అయినందున మంచి పనులు చేసి జీవితం మంచి మార్గంలో వెళ్లేందుకు పలు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిదే.
[…] Also Read: Rajyog For 5 Zodiacs: 59 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఒకే రోజ… […]