Nadamuri Balakrihsna: బాబాయ్ బాలయ్య ఫైర్…,జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడంటూ చర్చ
Nadamuri Balakrihsna: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు మాత్రం ఆయన్ను విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన సినిమా కెరీర్ పై దృష్టిసారించారు. పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఆస్కార్ బరిలో సైతం నిలిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడా రాజకీయాలు మాట్లాడకపోయినా.. రాజకీయ వేదికలు పంచుకోకపోయినా.. తరచూ ఆయన రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట బీజేపీ అగ్రనేత అమిత్ షా అభిమతం మేరకు […]

Nadamuri Balakrihsna: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నా.. రాజకీయాలు మాత్రం ఆయన్ను విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన సినిమా కెరీర్ పై దృష్టిసారించారు. పాన్ ఇండియా స్థాయి సినిమాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఆస్కార్ బరిలో సైతం నిలిచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడా రాజకీయాలు మాట్లాడకపోయినా.. రాజకీయ వేదికలు పంచుకోకపోయినా.. తరచూ ఆయన రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట బీజేపీ అగ్రనేత అమిత్ షా అభిమతం మేరకు ఆయన్ను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. అటు తరువాత దీనిపై పెద్ద రాజకీయ దుమారమే రేగింది. పలువలుచిలువలు చేసి మాట్లాడారు. చివరకు వైసీపీ నేత కొడాలి నాని సైతం తన స్టైల్ లో మాట్లాడేశారు. అయితేఈ వివాదం సద్దుమణిగిందన్న తరుణంలో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. దీనిపై టీడీపీ నాయకులతో పాటు అన్ని రాజకీయపక్షాల నేతలు ఖండిస్తున్నారు. ప్రభుత్వానిది తప్పుడు చర్యగా అభివర్ణిస్తున్నారు.

Nadamuri Balakrihsna, NTR
అయితే ఎన్టీఆర్ పేరు మార్పు విషయమై నందమూరి కుటుంబసభ్యులంతా స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ పేరిట ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పేరు మార్పును ఖండించారు. అటు నందమూరి బాలక్రిష్ణ కూడా స్పందించారు. ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలుగు విద్యార్థుల కోసం ఎన్టీఆర్ అనతికాలంలోనే యూనివర్సిటీని ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. అటు ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా స్పందించారు. హెల్త్ యూనివర్సిటీతో ఎన్టీఆర్ కు విడదీయరాని బంధం ఉందన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఒక్క ఎన్టీఆర్ పేరు మాత్రమే సూటవుతుందన్నారు. అసలు ఈ యూనివర్సిటీతో వైఎస్సార్ కు సంబంధమే లేదని.. అటువంటప్పుడు పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు.
నందమూరి కుటుంబసభ్యుల్లో అందరూ స్పందిస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదన్న చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. తాతను దైవంతో చూస్తానని.. తాత స్థాపించిన పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈ నేపథ్యంలో తాత పేరిట ప్రతిష్ఠాత్మకంగా ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చితే కనీసం స్పందించకపోతే ప్రజల్లో చులకనయ్యే ప్రమాదమైతే ఉంది. అంతకంటే ముందుగా టీడీపీ శ్రేణులు వ్యతిరేకించే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు తరువాత ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎన్టీఆర్ ను టీడీపీలోని ఒక వర్గం భావస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ ను పార్టీలోకి తేవాలన్నడిమాండ్ వినిపించింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్లు అయితే తప్పకుండా జూనియర్ ను తేవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. టీడీపీలో మెజార్టీ వర్గం భావి నాయకుడిగా పరిగణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటువంటి సమయంలోనైనా స్పందించాల్సిన అవసరముంది.

Nadamuri Balakrihsna
గతంలో చంద్రబాబు సతీమణి, జూనియర్ ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరిపై వైసీపీ నేతలు, తన సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చాలా లేటుగా స్పందించారు. ఏదో తూతూమంత్రంగా నాలుగు నీతి వాఖ్యలు చెప్పి ముగించారు. దీనిపై కూడా అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయ. అవమానానికి గురైంది నందమూరి ఆడపడుచు.కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు చూసిన తరువాత ఆయన అభిమానులు కూడా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో అటువంటి విమర్శలు రాకుండా ప్రభుత్వ తీరును ఎండగట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.
