Mindset of successful people: జీవితంలో గెలవాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇందులో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. మిగతావారు చెబుతున్న కారణాలు ఏంటంటే? తమకు అదృష్టం లేదని.. తమకు చెప్పేవారు లేరని.. తమ కుటుంబ పరిస్థితులు బాగా లేవని.. తమకు డబ్బుంటే గోల్ కచ్చితంగా సాధిస్తామని.. అంటుంటారు. కానీ పురాణాల ప్రకారం చెట్టుపై ఉన్న కాకిని గురిపెట్టడానికి చెట్ల ఆకులు చూడొద్దని.. కాకిని మాత్రమే చూడాలని చెప్పేవారు. అలాగే ఒక గోల్ సాధించాలంటే కారణాలను.. పరిస్థితులకు భయపడవద్దని.. గోల్ మాత్రమే చూస్తూ వెళ్లాలని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు. అయితే చాలామంది ఇలా సంసిద్ధంగా ఒక పనిని పూర్తి చేయడానికి ముందుకు కదులుతారు. కానీ ఒక శాతం మాత్రమే చివరి వరకు చేరుకుంటారు. అలా ఎందుకు చేరుకుంటారు? మిగతావారు చేస్తున్న తప్పేంటి?
Also Read: Life Lessons From Struggles: కష్టాల్లో ఉన్నవారు ఈ ఐదు విషయాలను నేర్చుకుంటారు..
అందమైన జీవితం కోసం చాలా కష్టపడాలని కొందరు నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే చాలామంది కోరుకునే దుర్బుద్ధి ఏంటంటే ఏ పని చేయకుండా డబ్బు రావాలని.. అదృష్టం కలగాలని అంటుంటారు. అయితే ప్రపంచంలో ఒక శాతం మాత్రమే అదృష్టాన్ని కలిగి ఉంటారు. మిగతావారు ప్రత్యేకంగా అదృష్టం కావాలని కోరుకోవడం చాలా తప్పు అని అంటారు. ఒక గమ్యాన్ని చేరాలని అనుకునేవారు నిరంతరం కష్టపడుతూనే ఉండాలని అంటారు. అయితే వీరు కొన్ని విషయాలను మాత్రం గుర్తు పెట్టుకోవాలని చెబుతారు.
జీవితంలో సక్సెస్ కావాలని అందరూ కోరుకుంటారు. అయితే వీరిలో 50% మంది సక్సెస్ పయనం స్టార్ట్ చేయడానికి ముందుకు రారు. 20 శాతం మంది సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫెయిల్యూర్ రాగానే ఆపేస్తారు. 29 శాతం మంది మధ్యలోనే ఆగిపోతారు. ఒక శాతం మాత్రమే చివరి వరకు చేరుకొని విజయం సాధిస్తారు. అయితే ఈ చివరి వరకు చేరుకోవాలంటే ఎన్నో రకాలుగా కష్టపడాల్సి ఉంటుంది. ఈ కష్టాలకు భయపడి చాలామంది వెనుకడుగు వేస్తారు. అలా వెనుకడుగు వేయకుండా చివరి వరకు ప్రయత్నించిన వారి సక్సెస్ అవుతారు.
అయితే గమ్యం మొదలుపెట్టిన తర్వాత చివరి వరకు చేరుకోవాలంటే కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. వీటిలో ఓర్పు. ఎన్నో రకాల మనసులు నువ్వు చేసే గమ్యం గురించి హేళన చేస్తూ ఉంటారు.. కొందరు మధ్యలోనే ముగించమని సలహాలు కూడా ఇస్తారు. కానీ నువ్వు వెళ్లే దారి సరైనదే అనుకుంటే ఎవరి మాట వినకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరికొందరు నువ్వు చేసే పయనానికి అడ్డంకులు సృష్టిస్తారు. అంటే ఏదో ఒక కారణాలు చెప్పి వెళ్లకుండా చేస్తారు. అంతేకాకుండా నీతో పాటు గమ్యం చేసేవారు అయితే నీ గమ్యాన్ని ఆగిపోవడానికి కూడా ప్రయత్నిస్తారు. ఇలాంటివారిని పట్టించుకోకుండా ముందుకు వెళుతూనే ఉండాలి. అంతేకాకుండా సక్సెస్ జర్నీ ప్రారంభించిన సమయంలో ఎలాంటి మనస్తత్వం ఉన్నదో.. అదే మనస్తత్వం చివరి వరకు ఉండాలి. అలా ఉన్నప్పుడే విజయవంతంగా జర్నీ పూర్తి చేయగలుగుతారు.