Single Life Trend Among Indian Youth: సోలో నుంచి మొదలుపెడితే సోలో బతుకే సో బెటరూ అనే సినిమాల దాకా అన్నింటి పరమార్థం ఒకటే. హీరో ముందుగా ఒంటరిగా ఉంటాడు. ఒంటరితనాన్ని ఇష్టపడుతుంటాడు. చివరికి ప్రేమలో పడి వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత కథ సుఖాంతం అవుతుంది. సోలోగా మొదలైన సినిమా కథ హీరో మింగిల్ అవడంతో పూర్తవుతుంది.
నిజ జీవితంలో ఒంటరిగా ఉండడానికి.. ఏక్ నిరంజన్ లాగా ఉండిపోవడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.. నిన్న మొన్నటివరకు ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు దేశ యువతలో చాలా మార్పు వచ్చింది. ఈ సమస్యపై పెద్దగా ఎవరూ దృష్టి సారించడం లేదు కాని.. వాస్తవానికి పరిస్థితి ఇలానే ఉంది. మనదేశంలో వివాహ బంధంలో అడుగుపెట్టడానికి అనాసక్తిని ప్రదర్శించే యువత పెరిగిపోతున్నారని కొన్ని రకాల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇంతవరకు పెద్దగా ఎవరూ దృష్టి సారించలేదు. సీరియస్ గా అధ్యయనాలు చేయడం లేదు. వాస్తవానికి గ్రామాల నుంచి మొదలు పెడితే నగరాల వరకు సింగిల్ గా బతికే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మన దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను పరిశీలిస్తే దాదాపు 10 శాతం యువత వివాహానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఇతర దేశాలలో ఇది ఆశించినంత స్థాయిలో పెద్ద శాతం కాకపోయినప్పటికీ.. సంప్రదాయాలు, సంస్కృతుల ఆధారంగా బతికే భారతదేశంలో ఏకంగా 10 శాతం యువత పెళ్లికి దూరంగా ఉన్నారంటే కాస్త ఆలోచించాల్సిన అంశమే..
Also Read: Fridge: సింగిల్ డోర్, డబల్ డోర్ ఫ్రిడ్జ్ లలో ఏది బెటర్?
అప్పట్లో ఇలా ఉండేది కాదు
సరిగ్గా ఒక దశాబ్దం క్రితం కాలాన్ని పరిశీలిస్తే.. పెళ్లి విషయంలో ఇంతటి ఇబ్బంది ఉండేది కాదు. ఈడు వచ్చిన అబ్బాయికి త్వరగానే పెళ్లి జరిగేది. ఆర్థిక స్థిరత్వం, ఆస్తులు, ఉద్యోగం ఇవన్నీ కూడా పెద్దగా లెక్కలోకి తీసుకునేవారు కాదు. అబ్బాయి కుటుంబ నేపథ్యం సరిగా ఉంటే వెంటనే పెళ్లి చేసేవారు. ఇక ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. పెళ్లికి ఉద్యోగం అనేది ఒక ఖచ్చితమైన అర్హతగా మారిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో అయితే ఈ పట్టింపులు మరింత పెరిగిపోయాయి. వ్యవసాయం చేసుకునే వారికి వివాహం జరగడం కష్టమైపోతుంది. ఎకరాల్లో భూములు ఉన్నప్పటికీ అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.
ఉద్యోగులకు కూడా..
ఉద్యోగులకు కూడా పెళ్లిళ్లు కావడం లేదు. ఎందుకంటే అమ్మాయిలు అంచనాలు వేరే విధంగా ఉన్నాయి. పైగా ఇటీవల కాలంలో పరిణామాలు అమ్మాయిల వ్యవహార శైలిని మరో కోణంలో చూపిస్తున్నాయి. దీంతో పెళ్లి చేసుకోవడం ఎందుకు అనే భావన యువకుల్లో పెరిగిపోతోంది. ఎందుకైనా మంచిది ఒంటరిగా ఉండడమే ఉత్తమం అనే భావన యువకుల్లో వేళ్ళూనుకుంటున్నది. ఇన్ని సంవత్సరాలపాటు ఒంటరి జీవితం అంటే సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ, ప్రభాస్ ను మాత్రమే చెప్పుకునేవారు. కానీ నేటి కాలంలో ఈ జాబితాలో చాలామంది చేరే అవకాశం కనిపిస్తోంది. దీనివల్ల రకరకాల సమస్యలను దేశం ఎదుర్కోవాల్సి ఉంటుంది.