Life Lessons From Struggles: కొంతమంది తమకు నిత్యం కష్టాలు ఉన్నాయంటూ బాధపడుతూ ఉంటారు. తమ జీవితం అల్లకల్లోలంగా మారుతుందని ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే కష్టాలు, నష్టాలు ఏర్పడినప్పుడే అసలైన జీవితం తెలుస్తుందని కొందరు మానసిక నిపుణులు తెలుపుతుంటారు. ఎందుకంటే ఇలాంటి సమయంలోనే మంచి చెడులు, బంధువులు, స్నేహితులు నిజమైన వారెవరో తెలుసుకునే అవకాశం ఉంటుందని అంటుంటారు. అసలు కష్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? కష్టాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
మంచి నిర్ణయాలు..
ఒక మనిషికి అన్ని సౌకర్యాలు ఉంటాయని ఎప్పుడూ అనుకోలేదు. అనుకున్న పనులు సమయానికి కాలేనప్పుడు బాధ కలుగుతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తోచదు. అయితే కొందరు మాత్రం తమకు కష్టం ఎదురైనప్పుడు ఆ పరిస్థితి నుంచి బయట పడాలని అనేక రకాలుగా ఆలోచిస్తుంటారు. ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఆలోచన శక్తి పెరుగుతుంది. సాధారణ సమయంలో కంటే కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచిస్తారు. దీంతో మెదడు మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఇదే సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
బంధుత్వం
కొంతమందికి చూడడానికి ఎంతో మంది బంధువులు, స్నేహితులు ఉంటారు. కానీ చాలామంది ఎదుటివారి సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కలుస్తుంటారు. బాధలో ఉన్నప్పుడు పట్టించుకోరు. అయితే కష్టాలు వచ్చినప్పుడు ఎవరైతే ఆప్త మిత్రులుగా ఉంటారో.. వారే నిజమైన బంధువులు, స్నేహితులుగా గుర్తించుకోవచ్చు. ఇలాంటి వారితోనే శాశ్వతంగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల కష్టాల ద్వారా మంచివారు ఎవరో? చెడ్డవారెవరో తెలిసిపోతుంది?
జ్ఞానం
కష్టాల సమయంలో కొందరికి ఏం చేయాలో తోచదు. కానీ ఇలాంటి సమయంలోనే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దీంతో రకరకాలుగా ఆలోచించి తెలివైన పనులు చేయగలుగుతారు. ఇదే సమయంలో తెలివి పెరిగి కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఫలితంగా అనేక జ్ఞానాన్ని పొందగలుగుతారు. కష్టం వల్ల ఒక రకంగా అమితమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది.
Also Read: Health Tips: సి-సెక్షన్ తర్వాత కుట్ల నొప్పితో బాధపడుతున్నారా?
ఓర్పు
ప్రస్తుత కాలంలో అయితే ఎవరికి ఓర్పు లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది బిజీ వాతావరణం లో గడపడం వల్ల ఎక్కడ ఒకచోట ఉండే పరిస్థితి లేదు. అంతేకాకుండా కొన్ని విషయాలు వెంటనే పూర్తి కావాలన్నా తొందరలో ఉంటున్నారు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరం. ఈ ఓర్పు అనేది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే అలవాటుగా మారుతుంది. కష్టాల సమయంలో కొన్ని పనులు చేయకుండా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా కష్టం నుంచి బయట పడేందుకు సమయం పడుతుంది. ఈ సమయంలో సహనంతో ఉండాల్సి వస్తుంది. ఈ సహనమే జీవితాన్ని సక్రమంగా ఉండేలా చేస్తుంది.
అనుభవం
కష్టాలు పదేపదే వస్తే ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ పోవడానికి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఒక కష్టం పూర్తయిన తర్వాత అనుభవం ఏర్పడి మరో కష్టం వచ్చినప్పుడు దాని నుంచి బయటపడి ఎందుకు అనుభవం ఏర్పడుతుంది. ఇలా భవిష్యత్తులో ఎంత పెద్ద కష్టం వచ్చినా బయటపడే మార్గం దొరుకుతుంది. అందువల్ల ఎటువంటి కష్టం వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి.