Hyundai: మధ్యతరగతి ప్రజలు కూడా సొంతంగా కారు ఉండాలని ఈ కాలంలో కోరుకుంటున్నారు. అయితే మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా లో బడ్జెట్లో కారు ఉండి ఎక్కువ మైలేజ్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసం కంపెనీలు ప్రత్యేకంగా కొన్ని మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటాయి. దక్షిణ కొరియా కంపెనీ Hyundai భారతదేశంలో ఎన్నో కార్లను వినియోగదారులకు అందించింది. ఇండియా బ్రాండ్ తో రిలీజ్ చేస్తున్న ఈ కార్లు ఎంతో పాపులారిటీ సాధించాయి. Sedan నుంచి SUV వరకు వివిధ రకాల కార్లను రిలీజ్ చేసి రోడ్లపై తిప్పుతోంది. అయితే వీటిలో ఓ కారును ఇటీవల ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ధరతో ఉండి.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ కారును ఎగబడి మరీ కొంటున్నారు. మరి ఆ కారు ఏదో తెలుసుకుందామా..
ప్రతి నెలలో కంపెనీ తన కార్ల సేల్స్ గురించి ప్రకటిస్తూ ఉంటుంది. తాజాగా హ్యుందాయ్ మోటార్స్ 2025 జనవరి నెలలో జరిగిన కార్ల అమ్మకాల గురించి బయట పెట్టింది. వీటిలో Exter SUV కారు గురించి ప్రత్యేకంగా తెలిపింది. ఈ కారు జనవరి నెలలో 6,068 యూనిట్ల అమ్మకాలు జరుపుకుంది. అయితే ఇదే కారు 2024 జనవరిలో 5,270 యూనిట్లు నమోదు చేసుకుంది. అంటే ఏడాదిలో ఈ కారు అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ఈ కారులో ఉండే ఫీచర్స్ తోపాటు ధర అందుబాటు ఉండడమేనని అంటున్నారు.
Hyundai Exter కారును ప్రస్తుతం మార్కెట్లో రూ. 6.21 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంటు రూ.10.51 లక్షలు గా ఉంది. అయితే ఎక్కువగా ఈ కారును మిడిల్ క్లాస్ పీపుల్స్ కోరుకుంటున్నారు. సాధారణంగా SUV కారు ఇంత తక్కువ ధరలో రావడం కష్టమే. కానీ హుందాయి Exter ద్వారా వినియోగదారులకు అందిస్తుంది. ఇక ఈ కారులో ఉండే ఫీచర్స్ కూడా ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి.
Hyundai Exter SUVలో పెట్రోల్ ఇంజన్ తో పాటు CNG వేరియంట్ కూడా ఉంది. పెట్రోల్ వేరియంట్ 19.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. CNG వేరియంట్ లో 27.1 కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తుంది. ఈ కారు ఎక్సీటీరియర్ ఫీచర్స్ లో భాగంగా ఎల్ఈడి డిఆర్ఎల్ తోపాటు ఆకట్టుకునే డిజైన్, అల్లాయి వీల్స్ వంటివి ఉన్నాయి. ఇన్నర్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ AC, వైర్లెస్ ఫోన్ చార్జర్, క్విజ్ కంట్రోల్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఎక్కువగా కోరుకుంటున్న సన్ రూఫ్ ఫీచర్ ను కూడా అమర్చారు. సేఫ్టీ కోసం ఈ కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా లాంటివి ఉన్నాయి.మార్కెట్లో ఉన్న ఎస్ యూవీల్లో ఉండే ఫీచర్స్ ఇందులో ఉండి ధర తక్కువగా ఉండడంతో ఈ కారును ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారని కంపెన ప్రతినిధులు తెలుపుతున్నారు.