Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాలన్నిటిలో బుధుడు చల్లని గ్రహముగా పేర్కొనబడతాడు. ఈ గ్రహం అనుగ్రహం ఉంటే ఆయారాశుల వారి జీవితాల్లో విశేష ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. వేద శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 22 నుంచి బుధుడు కుంభరాశిలో ప్రయాణించనున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఆయా రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మూడు రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేంటంటే..?
బుధుడు కుంభరాశిలో ప్రయాణం మొదలుపెట్టడం వల్ల మేషరాశిపై ప్రభావం పడుతుంది. దీంతో ఈ రాశి వారికి ఈరోజు నుంచి అన్నీ అనుకూల పవనాలే కలగనున్నాయి. మీరు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న సమస్యలు పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయంగా ఉంటుంది. అనుకోని అదృష్టం వల్ల వివిధ మార్గాల నుంచి ధనం ఇంట్లోకి వస్తుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. దీంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఫలితంగా పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొందరితో వాగ్వాదం ఉండడం వల్ల మానసికంగా కాస్త ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం జరిగితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.
సింహరాశి వారికి బుధ గ్రహం ప్రభావం ఉండనుంది. ఈ రాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి మహార్దశ పట్టనుంది. వీరికి బంధువుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు విశేష ప్రయోజనాలు ఉండనున్నాయి. భాగస్వాముల సహకారంతో అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. పూర్వీకుల ఆర్తి విషయంలో వీరికి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. కొందరికి పదోన్నతులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. కొత్త వారితో అప్పుడే చొచ్చుకుపోకుండా ఉండాలి. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.
బుధుడి స్థానం మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి అనేక లాభాలు జరగనున్నాయి. ఈ రాశి వారు కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. అనుకున్న పనిని పూర్తి చేయడంతో జీతం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అయితే వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.