New cars
Good News: కార్లు కొనే వారి సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతుంది. సామాన్యుల సైతం సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే వీరు తక్కువ ధరలో కారును కొనుగోలు చేస్తూ మంచి మైలేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు తక్కువ ధరకే కార్లను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. సాధారణంగా ప్రస్తుతం ఏ కారు కొనుగోలు చేయాలన్న రూ 5 లక్షలకు పైగానే ఉంటుంది. కానీ ఓ కంపెనీ మాత్రం మూడున్నర లక్షలతో ఓ కారును అందించేందుకు ముందుకు వచ్చింది. తక్కువ బడ్జెట్లో కారు కొనేయాలని అనుకునే వారికి ఇదే మంచి సమయమని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి..
సాధారణంగా లో బడ్జెట్ కార్లు అనగానే మారుతి సుజుకి కంపెనీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఈ కంపెనీకి బజాజ్ పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. బజాజ్ కంపెనీకి చెందిన Cute కారు గురించి ఇప్పుడు చర్చని అంశంగా మారింది. ఈ కారు చూడ్డానికి చిన్నగా అనిపించినప్పటికీ ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంది. ఇది 2019 లోనే మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇటీవల దీని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ప్రాక్టికల్ క్యాబిన్ లేఅవుట్ తో ఫస్ట్ జనరేషన్ మోడల్ గా పేర్కొంటున్న ఈ కారులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారులో గేర్ లివర్, స్పీడోమీటర్ వాటి ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా ఇందులో డాష్ బోర్డు డిజైను అమర్చారు. స్టీరింగ్ వీల్ వెనకాల స్పీడోమీటర్ కన్సోను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సెంటర్ కన్సోల్ సెంట్రల్ ని మౌంటెడ్ ఏసీవెంట్ వంటివి ఉన్నాయి. యాసైటీ కి అప్డేట్ తో పాటు రీడిజైన్ బంపర్ నైట్ సెటప్ ను చేశారు. ఇలా కారు మొత్తం కొత్త రకంగా కనిపించి ఆకట్టుకుంటుంది.
బజాజ్ క్యూట్ కారు గురించి మార్కెట్లో ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. దీనిని రూ.3.61 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇందులో 217 సిసి పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. అలాగే ఎల్పిజి సిఎన్జి ఫ్యూయల్ ఆప్షన్ రెండు కలిగి ఉంది. 2024 ఏడాదిలో బజాజ్ క్యూట్ అమ్మకాలు 56 శాతాన్ని కలిగి ఉంది. అయితే దీనిని ఎలక్ట్రిక్ వర్షాల్లో కూడా తీసుకోవచ్చు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సాధారణ త్రీ వీలర్ తరహాలోనే ఈక్వా డ్రెస్ సైకిల్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. ఇందులో ఇంజన్ వెనుక వైపు ఉండడంతో స్పీడ్ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరిగెడుతుందని పేర్కొంటున్నారు. అయితే కొత్త మోడల్ కోసం భారతీయ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న బజాజ్ క్యూట్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సిటీలో ఉండే వారితో పాటు అదనంగా కారు ఉండాలని కోరుకునే వారికి ఈ సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా బజాజ్ కంపెనీకి చెందిన ఈ కారు ఇప్పటికే ఆదరణ పొందింది.