Married : సరిగ్గా పని చేయకపోతే ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థలను చూశాం. జీతం ఎక్కువైందని.. కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగించిన సంస్థలను కూడా మనం చూసాం. ఆర్థిక మాంద్యం వల్ల ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు వేసిన కంపెనీలను కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఈ కంపెనీ మాత్రం చాలా డిఫరెంట్. ఉద్యోగులను తొలగించడానికి ఈ కంపెనీ ఎంచుకున్న మార్గం ప్రపంచంలోనే 8వ వింత.
ఆ కంపెనీ పేరు షాన్ డాంగ్. ఐటీ ఆధారిత కార్యకలాపాలు సాగిస్తుంది. చైనా కేంద్రంగా ఈ కంపెనీ పనిచేస్తోంది. ఈ కంపెనీలో వేలాది మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు ఆ కంపెనీ వేతనాలు చెల్లిస్తుంది. బోనస్, ఇంక్రిమెంట్ ఇట్లాంటి విషయాలలో ఆ కంపెనీ ఏమాత్రం వెనుకాడదు. పైగా పండుగల సమయంలో ఫెస్టివల్ అడ్వాన్సులు కూడా ఉద్యోగులకు ఇస్తుంది. పేరుకు ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థల స్థాయిలో ఉద్యోగాలకు వేతనాలు ఇస్తుంది, సౌకర్యాలు అంతకుమించిన స్థాయిలో కల్పిస్తుంది. కంపెనీ అత్యున్నత సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు కష్టపడి పని చేస్తుంటారు. కంపెనీ ఉన్నతికి తోడ్పడుతుంటారు. అయితే ఆ కంపెనీ ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ఇప్పుడు ఆ ఉద్యోగులను అంతర్మథనంలో పడేసింది.
చైనాలో ప్రస్తుతం వివాహ దారుణంగా పడిపోయింది. సంతాన ఉత్పత్తి కూడా నేల చూపులు చూస్తోంది. అందువల్లే జనాభా రేటు తగ్గిపోయి చైనా రెండవ స్థానానికి పడిపోయింది. ఇప్పటికే ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల దేశ ఆర్థిక రంగం సవాళ్ళను ఎదుర్కొంటున్నది. అందువల్లే దేశంలో వివాహాల సంఖ్యను పెంచాలని.. జననాల సంఖ్యను కూడా పెంచాలని చైనా ఇటీవల నిర్ణయించుకుంది. ఇందులో భాగం గానే అన్ని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు షాన్ డాంగ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీ ఒంటరి ఉద్యోగులు సెప్టెంబర్ లోగా పెళ్లి చేసుకోవాలని..లేని పక్షంలో వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. “ఒంటరి ఉద్యోగులకు ఒక విజ్ఞప్తి. మీరు సెప్టెంబర్ లోగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న దృవీకరణ పత్రాన్ని కంపెనీకి సమర్పించాలి. లేనిపక్షంలో మీరు ఉద్యోగానికి రావలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కంపెనీ ఒంటరి ఉద్యోగులతో నడవదు. ప్రతి ఉద్యోగి సొంత కుటుంబాన్ని కలిగి ఉంటేనే బాగుంటుంది. లేనిపక్షంలో అది దేశ వృద్ధి రేటుకు విఘాతం కలిగిస్తుందని” షాన్ డాంగ్ కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, కొంతమంది ఉద్యోగులు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. అమ్మాయిలు దొరకపోవడంతో రద్దు చేసుకున్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రేమ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే షాన్ డాగ్ కంపెనీలో వేతనాలు బాగుంటాయి. భత్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అందువల్లే ఆరు నూరైనా సరే పెళ్లి చేసుకోవడానికి ఉద్యోగులు సిద్ధపడుతున్నారు.