Marriage Vastu Tips: సాధారణంగా చాలామంది జాతకంలో కొన్ని దోషాలు ఉండటంవల్ల వివాహం అనేది ఆలస్యంగా జరుగుతుంది. ఎన్నో సంబంధాలు వస్తున్నప్పటికీ ఒక్కటి కూడా కుదరక ఎంతో సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే దోషాలు తొలగి పోవడానికి ఎన్నో పూజలు హోమాలు చేస్తున్న పెద్దగా ఫలితం ఉండదు.అలా పెళ్లి సమస్యతో బాధపడేవారు కేవలం కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా వివాహం తొందరగా జరుగుతుందని వాస్తునిపుణులు చెబుతున్నారు. మరి చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం….
పెళ్లి ఆలస్యంగా జరుగుతున్న వారు వారి పడకగదిలో ఎప్పుడు మాండరిన్ బాతుల విగ్రహాన్ని ఉంచాలి అందులో ఒకటి మగ బాతు మరొకటి ఆడ బాతు ఉండేలా చూసుకోవడం వల్ల వివాహ దగ్గర పడతాయి. అలాగే పెళ్లి ఆలస్యము అవుతున్న అమ్మాయి లేదా అబ్బాయి పడకగదిలో ఎల్లప్పుడు వాయువ్య మూలకు తల పెట్టి పడుకోవాలి. పొరపాటున కూడా దక్షిణం వైపు తల పెట్టి నిద్ర పోకూడదు ఇలా నిద్రపోతే వివాహం ఆలస్యం అవుతుంది.
వివాహం ఆలస్యం అయ్యేవారు వారి పడక గదిని ఎప్పుడూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేత గులాబీ నీలిరంగులతో అలంకరించుకోవాలి. వివాహం కుదిరి చివరికి చెడిపోతే అలాంటి వారు పడక గదిలో నైరుతి మూలలో కత్తెర లేదా కత్తి వంటి పదునైన వస్తువులను పెట్టకూడదు.పెళ్లి కావాల్సిన వారి పడక గదిలో ఉత్తరం గోడకు శివపార్వతులు లేదా రాధాకృష్ణ ఉన్నటువంటి విగ్రహాన్ని అతికించాలి. అలాగే నైరుతి వైపు రెండు క్రిస్టల్ బాల్స్ ఉంచడం వల్ల తొందరగా వివాహ గడియలు వస్తాయి.