https://oktelugu.com/

Making Tea : అసలు టీ చేసే సరైన పద్ధతి ఏంటి?

Making Tea: అసలు టీ చేయడానికి సరైన పద్ధతి ఏంటనే విషయం మనలో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఇంతకీ టీ చేయడానికి గల సరైన పద్ధతి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By: , Updated On : March 18, 2025 / 09:55 PM IST
Making Tea

Making Tea

Follow us on

Making Tea : టీ అనేది అందరూ కూడా తాగుతుంటారు. అసలు టీ తాగకపోతే కొందరికి అసలు రోజు గడవదు. ఉదయం లేచిన వెంటనే తప్పకుండా ఒక గ్లాసు టీ తాగుతారు. మళ్లీ అవసరమైతే ఎన్నో సార్లు తాగుతారు. సీజన్‌తో సంబంధం లేకుండా చాలా ఎక్కువగా కొందరు తాగుతుంటారు. కొన్నిసార్లు టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అన్ని సార్లు కాదు. ఎంత వరకు లిమిట్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే చాలా ఒక్కోక్కరు టీని ఒక్కోక్కలా చేస్తారు. దాని బట్టి వాటి టీ టేస్ట్ ఉంటుంది. అందరూ కూడా ఒకేలా టీ ప్రాసెస్ చేయరు. దీనివల్ల వల్ల టీ టేస్ట్ కూడా మారిపోతుంది. అయితే కొందరు ముందగా బ్లాక్ టీ చేసి అందులో పాలు వేసుకుని తాగుతారు. మరికొందరు అన్నింటిని ఒకసారి వేసి కలిపి మరిగిస్తారు. కొందరు ఏదో లైట్‌గా టీను మరిగిస్తారు. మరికొందరు ఎక్కువ సమయం పాలను మరిగిస్తారు. దీనివల్ల టీ చాలా టేస్టీగా ఉంటుందని భావిస్తారు. అయితే అసలు టీ చేయడానికి సరైన పద్ధతి ఏంటనే విషయం మనలో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఇంతకీ టీ చేయడానికి గల సరైన పద్ధతి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Also Read : టీ ఇలా తయారు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..

నిజానికి టీ చేయడానికి అన్నింటిని కలిపి ఒక్కసారి మరిగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ముందుగా బ్లాక్ టీ చేసుకోవాలి. అంటే కాస్తా వాటర్ వేసి.. టీ పొడి వేసి ఎక్కువ సమయం మరిగించాలి. ఆ తర్వాత ఈ బ్లాక్ టీలో పాలు వేసి కలపాలి. మీకు టీ బాగా వేడిగా కావాలనుకుంటే మళ్లీ వీటిని ఒక 5 నిమిషాలు మరిగించవచ్చు. లేదంటే అలానే తాగాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా బ్లాక్ టీ చేసి అందులోనే పాలు కలపితేనే బాగుంటుంది. ఇలా చేసిన టీ టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదట. అదే ముందు మీరు పాలు, టీ పొడి అన్నింటిని కూడా కలిపితే మాత్రం టీ పెద్దగా టేస్ట్ ఉండదు. అలాగే టీ పొడి అందులో మొత్తం ఎక్కువగా సమయం మరగడం వల్ల తాగిన టీ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొందరు టీని ఎక్కువ సమయం మరిగిస్తుంటారు. ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. టీని తక్కువ సమయం మాత్రమే మరిగించాలి. అలాగే టీ చేసి ఉంచి గంటల తర్వాత తాగకూడదు. చేసిన వెంటనే తాగేయాలి. అంతేకానీ పొద్దున్న తాగిన టీని మళ్లీ రాత్రికి తాగకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా చేసిన టీ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. టీ మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి, బాడీకి వేడి చేయడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువగా టీని తీసుకోవద్దు. కాస్త మితంగానే రోజుకి ఒక రెండు సార్లు మాత్రమే తీసుకోండి.