Mahila Samman Savings: మహిళల కోసం కేంద్రం తెచ్చిన కొత్త స్కీం ఇది..ఖాతాల్లో 30 వేలకు మించి పడతాయి..

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తేనే దేశం ప్రగతి పథంలో పయనించినట్టు.. అందుకోసమే మహిళలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం "మహిళా సమ్మాన్ సేవింగ్స్" అనే పథకాన్ని తీసుకొచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 12, 2024 3:29 pm

Mahila Samman Savings

Follow us on

Mahila Samman Savings: ఎంత సంపాదించినా సరే పొదుపు అనేది కచ్చితంగా ఉండాలి. పొదుపు లేకపోతే జీవితంలో సమస్యలు ఎదురైతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చులు పెరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో కచ్చితంగా పొదుపు అనేది చేయాల్సిందే. పొదుపు అనగానే చాలామంది రకరకాల మార్గాలు అన్వేషిస్తుంటారు.. కానీ ఇక్కడ పొదుపు అనేది మాత్రమే కాకుండా, మన సొమ్ముకు భద్రత కల్పించాలి. అదనపు ఆదాయాన్ని కూడా అందించాలి.. బయట మార్కెట్లో ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ.. వాటిని నమ్మే పరిస్థితి లేదు. అవి ఏ సమయానికి బోర్డు తిప్పేస్తాయో తెలియదు.. అందుకనే పొదుపు చేసే వారి కోసం కేంద్రం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. ఆ పథకాన్ని వృద్ధులు.. మహిళల కోసం తీసుకొచ్చింది.. ఇందులో పొదుపు చేస్తే అదనపు వడ్డీ కూడా లభిస్తుంది.. ఇంతకీ ఆ పథకం ఏంటంటే..

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తేనే దేశం ప్రగతి పథంలో పయనించినట్టు.. అందుకోసమే మహిళలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం “మహిళా సమ్మాన్ సేవింగ్స్” అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం పోస్టాఫీసు లతో పాటు బ్యాంకుల్లో నూ అందుబాటులో ఉంది. తక్కువ పెట్టుబడి.. ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఆదాయం ఈ పథకం ద్వారా లభిస్తుంది. ఈ పథకంలో పొదుపు చేస్తే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. పైగా ఈ పథకం మెచ్యూరిటీ కాలపరిధి రెండు సంవత్సరాలుగా ఉంది. అంటే మహిళలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇందులో గరిష్టంగా రెండు లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. దీనిపై కేంద్రం 7.5% వడ్డీ ఇస్తుంది. అంతేకాదు ఈ పథకంలో పెట్టుబడి పెడితే ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 80- సీ కింద పన్ను మినహాయింపు కోసం క్లైయిం చేసుకోవచ్చు.

ఈ స్కీమ్లో ఉదాహరణకు రెండు లక్షలు పెట్టుబడి పెడితే.. దీనిపై కేంద్రం 7.5% వడ్డీ ఇస్తుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన రెండు లక్షల మీద మొదటి ఏడాది 7.5 శాతం వడ్డీతో 15వేలు లభిస్తాయి. ఆ తర్వాత ఆ నగదు అసలుకు జమవుతాయి. ఆ తర్వాత రెండవ ఏడాదిలో వడ్డీ ద్వారా 16,125 రూపాయలు లభిస్తాయి. అంటే ఇలా ప్రతి ఏడాది పెరుగుకుంటూ పోతుంది. ఈ పథకంలో మహిళలు రెండు లక్షల పెట్టుబడి పెడితే వారికి రెండు సంవత్సరాల తర్వాత వడ్డీ రూపంలో మొత్తంగా 31,125 లభిస్తుంది. అయితే ఈ పథకం 2025 వరకే అందుబాటులో ఉంది. ఆ తర్వాత ఇది ఉండకపోవచ్చు. కాబట్టి ఇబ్బంది లేకుండా అదనపు ఆదాయం పొందాలి అనుకునే మహిళలు.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెబుతున్నారు ఆర్థిక రంగ నిపుణులు.