https://oktelugu.com/

Lost Car Key: కారు Key మిస్సయిందా? ఈ తప్పు అస్సలు చేయకండి..

చాలా మంది కారు కొనుగోలు చేస్తారు. కానీ కారు మెయింటనెన్స్ చాలా ప్రధానమైనది. కారుకు సంబంధించి ప్రతినెలా మెయింటనెన్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ను కూడా కేటాయించాలి. ఇదే సమయంలో కారు భద్రత విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి.

Written By: Srinivas, Updated On : November 15, 2024 11:35 am
Lost Car Key

Lost Car Key

Follow us on

Lost Car Key: చాలా మంది కారు కొనుగోలు చేస్తారు. కానీ కారు మెయింటనెన్స్ చాలా ప్రధానమైనది. కారుకు సంబంధించి ప్రతినెలా మెయింటనెన్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ ను కూడా కేటాయించాలి. ఇదే సమయంలో కారు భద్రత విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి కొన్ని వస్తువులు పోతుంటాయి. ముఖ్యంగా కారు ‘కీ’ని ఎక్కడో పారేసుకుంటారు. ఈ క్రమంలో చాలా ఆందోళన కలుగుతుంది. అయితే కారు కీ కోసం షో రూం కు వెళ్తే.. కీ ఇవ్వడానికి రూ.25,000 అడుగుతారు. దీంతో రోడ్డు పక్కన ఉన్న వారి వద్ద కీ ని తయారు చేయించుకుంటారు. అయితే షోరూంలోనూ ఉచితంగా కీ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రోడ్డు పక్కన కీ ని తయారు చేయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ వివరాలు తెలుసుకునేందుకు కిందికి వెళ్లండి..

ప్రస్తుత కాలంలో కార్ల వినియోగం పెరిగిపోతుంది. అయితే ఒక్కోసారి కారు కీ ని మిస్సవుతుంది. కారు కీ లేకుండా కారు అస్సలే ఓపెన్ కాదు. దీంతో చాలా ఇబ్బందులకుగ గురవుతారు. కారు కీ వెళ్లగానే దానికి సంబంధించిన డూప్లికేట్ కీ ని రోడ్డు పక్కన ఉండే వెండర్స్ వద్ద తయారు చేయించుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల వారి వద్ద కారు కీ కి సంబంధించిన కోడ్ ఉండిపోతుంది. దీంతో వారు మరో కీ ని తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇది భవిష్యత్ లో కారు భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అందువల్ల కారు కీ ని రోడ్డు పక్కన చేయించుకోకుండా ఉండాలి.

అయితే కారు కీ మిస్ కాగానే షో రూం వెళ్లాలి. కానీ షో రూంలో కీ కాకుండా లాక్ సిస్టమ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కారు కీ కి సంబంధించిన కొత్త లాక్ సిస్టమ్ ను అమర్చాలంటే రూ.25,000 ఖర్చు అవుతుంది. వీటికి జీఎస్టీ కూడా అదనంగా ఉంటుంది. అయితే ఈ మొత్తం కట్టకుండా తప్పించుకునే అవకాశం ఉంది. అదే కారు కీ ఇన్సూరెన్స్. కారు ఇన్సూరెన్స్ చేయించుకునే సమయంలోనే కారు కీ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి. దీని ప్రీమియం కేవలం రూ.300 నుంచి రూ. 500 వరకు ఖర్చు అవుతుంది. కానీ కారు కీ మిస్సయిన సందర్భంగా ఈ ఇన్సూరెన్స్ ఉంటే షో రూం వారు ఉచితంగా కారు లాక్ సిస్టమ్ ను ఇస్తారు.

కారు ఇన్సూరెన్స్ చేసే సమయంలో కారు కీ ఇన్సూరెన్స్ చేయించుకున్నారనుకోండి. అయితే రోడ్డు పక్కన తయారు చేయించుకున్న కీ మిస్సయితే ఈ ఇన్సూరెన్స్ వర్తించదు. షో రూంలో కొనుగోలు చేసిన వాటికి మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కారు కీ ని షో రూంలోనే తీసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుత కాలంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కొందరు చాలా టెక్నిక్ గా కారును దొంగిలిస్తున్నారు. అందువల్ల కారు కీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటోమోబైల్ నిపుణులు పేర్కొంటున్నారు